BRS : సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని పెట్టిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీనే బీఆర్ఎస్ గా మార్చాడు. బీఆర్ఎస్ పార్టీగా మారక.. సీఎం కేసీఆర్ ఏపీలోకి అడుగుపెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక్క తెలంగాణకే పరిమితం కాదు. ఏపీతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంది. అయితే.. ముందుగా ఏపీలో పార్టీని బలపరచాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. దానికి కారణం..
తెలంగాణ పొరుగు రాష్ట్రం కావడం, తెలుగు రాష్ట్రం కావడం. అందుకే త్వరలోనే ఏపీలో బహిరంగ సభలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.అయితే.. ఏపీలో ఉన్న పలు పార్టీలు కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీపై మౌనంగా ఉన్నాయి. అస్సలు ఏమాత్రం రెస్పాండ్ కాలేదు. అధికార వైసీపీతో పాటు, టీడీపీ, ఇతర పార్టీలు కూడా ఏమాత్రం బీఆర్ఎస్ పార్టీపై స్పందించలేదు. బీఆర్ఎస్ పార్టీ ఏపీలో బలోపేతం అయితే ఆ ప్రభావం వైసీపీ, టీడీపీపై ఉంటుంది. తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టిన వైఎస్సార్టీపీ పార్టీపై కూడా ప్రభావం పడుతుంది.

BRS : తెలంగాణ సెంటిమెంట్ పోయినట్టేనా ఇక
తెలంగాణ పేరుతో టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. ఇప్పుడు జాతీయత భావనతో బీఆర్ఎస్ పార్టీ పుట్టింది. బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ దేశమంతా తిరిగితే… రాజకీయం చేస్తే మరి.. తెలంగాణ సెంటిమెంట్ పోయినట్టేనా? తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీకి ఉన్న తెలంగాణ సెంటిమెంట్ పోయినట్టేనా ఇక. తెలంగాణ సెంటిమెంట్ తో ఇన్ని రోజులు రాజకీయాలు చుసిన కేసీఆర్.. ఆంధ్రా రాజకీయలు ఎలా చేస్తారు? కేసీఆర్ పార్టీ వల్ల.. ఏపీలో కొన్ని పార్టీలపై ప్రభావం పడితే పడి ఉండొచ్చు గాక కానీ.. కొన్ని పార్టీలకు మాత్రం మేలు కలిగే అవకాశం ఉంది. మరి.. చూద్దాం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కాకుండా ఏపీలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.