ChandraBabu : ఇప్పటికే చంద్రబాబుకు చాలా తలనొప్పులు ఉన్నాయి. ఓవైపు పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని తర్జన భర్జన పడుతున్నారు. ఇంకో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈనేపథ్యంలో చంద్రబాబు ఎన్నికల కోసం సమాయత్తం కావాలి. నేతలకు దిశానిర్దేశం చేయాలి. కానీ.. ఈ సమయంలో కొందరు నేతలు చంద్రబాబును ఖాతరు చేయడం లేదు. కొందరైతే ఏకంగా బ్లాక్ మెయిలే చేస్తున్నారట. ఓ మహిళా నేత మాత్రం చంద్రబాబును ముప్పుతిప్పలు పెడుతున్నారట. ఆమె ఎవరో కాదు.. భూమా అఖిల ప్రియ. తనకు నచ్చినట్టుగా ఆమె చేసుకుంటూ పార్టీని సంప్రదించడం లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి.కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీకి ఉన్న పాపులారిటే వేరు. అందుకే అక్కడ ఆ కుటుంబమే పోటీ చేస్తూ వస్తోంది.
కానీ.. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి కాకుండా నంద్యాల నుంచి పోటీ చేయాలని భూమా అఖిల ప్రియ అనుకుంటున్నారట. అనుకోవడమే కాదు.. పార్టీ అధిష్ఠానంతో మాట్లాడకుండా, చంద్రబాబును సంప్రదించకుండా నంద్యాలలో సొంతంగా పార్టీ ఆఫీసును కూడా అఖిలప్రియ ఏర్పాటు చేసుకున్నారట. అఖిల విషయం తెలిసిన వెంటనే.. నంద్యాల మాజీ మంత్రి ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి, ఇతర నేతలు తనతో మాట్లాడారట. ఈ విషయంపై అభ్యంతరం తెలిపారట. అయినప్పటికీ ఆమె మాత్రం వాళ్లను పట్టించుకోలేదట. దీంతో ఈ విషయాన్ని చంద్రబాబు, నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారట. దీంతో చంద్రబాబే ఏకంగా రంగంలోకి దిగి అఖిల ప్రియతో మాట్లాడారట.

ChandraBabu : స్థానిక నేతలు అభ్యంతరం తెలిపినా పట్టించుకోని అఖిల ప్రియ?
నంద్యాలలో పార్టీ ఆఫీసు పెట్టొద్దని చెప్పారట. కానీ.. చంద్రబాబు మాటను కూడా ఖాతరు చేయకుండా అఖిల ప్రియ నంద్యాలలో పార్టీ ఆఫీసును ఓపెన్ చేసిందట. అసలు.. చంద్రబాబు చెప్పినా కూడా ఎందుకు అఖిల ప్రియ వినలేదు. నిజానికి.. ఇంకా ఆళ్లగడ్డలో టికెట్ ను చంద్రబాబు ఫైనల్ చేయలేదు. కానీ… అఖిల మాత్రం తన సొంత నిర్ణయాలు తీసుకోవడంతో చంద్రబాబు కూడా ఆమెను పట్టించుకోవడం మానేశారట. దీంతో తను ఆళ్లగడ్డ, నంద్యాలలో టీడీపీ ఎలా గెలుస్తుందా చూస్తా? అంటూ చాలెంజ్ చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ చంద్రబాబు తనకు ఇక్కడ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? లేక వేరే పార్టీలో చేరుతారా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.