YS Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకా అటూ ఇటుగా రెండేళ్ల సమయం ఉంది. అందుకే ఇప్పటి నుంచే సీఎం జగన్ అలర్ట్ అవుతున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే కూడా ఎక్కువ సీట్లు గెలవాలని సీఎం జగన్ ఆశిస్తున్నారు. ఈనేపథ్యంలోనే వైసీపీ నేతలు అందరినీ సీఎం జగన్ ప్రజలతో మమేకం అవ్వాలని చెప్పారు. ఈసారి భారీ మెజారిటీ గెలవాలంటే ఖచ్చితంగా మరింత కష్టపడాలని నేతలకు చెబుతూనే ఉన్నారు జగన్. మరోవైపు వైసీపీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలు కూడా కాచుక్కూర్చున్నాయి. అందుకే.. అందరూ ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని చెబుతున్నారు జగన్.
ఒక ముఖ్యమంత్రిగా జగన్ కు నూటికి నూరు మార్కులు వేయొచ్చు. కానీ.. వైసీపీలోని కొందరు ఎమ్మెల్యేల పనితీరుతోనే సీఎం జగన్ అసంతృప్తితో ఉన్నారట.చాలామంది ఎమ్మెల్యేలు సీఎం జగన్ చెప్పినట్టుగా ప్రజా సమస్యలపై దృష్టి పెడుతున్నారు. తమ నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చెబుతున్నారు. కానీ.. కొందరు ఎమ్మెల్యేలు మాత్రం జగన్ మాటలను ఖాతరు చేయడం లేదట. కొందరు ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సీరియస్ గా క్లాస్ కూడా పీకారట. ప్రజల సమస్యలు తెలుసుకోకుండా..

YS Jagan : ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకం అవడం లేదా?
ప్రజలకు సంక్షేమ పథకాలను వివరించకుండా.. నియోజకవర్గాల్లో పర్యటించకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారట. వారి పనితీరుపై చాలా అసంతృప్తిగా ఉన్నారట జగన్. ప్రజలతో మమేకం కావాలనే ఏపీ ప్రభుత్వం గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కానీ.. కొందరు నేతల వల్ల వైసీపీకి చెడ్డ పేరు వస్తుండటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో మనసు చంపుకొని మరీ సీఎం జగన్ కొందరు నేతలపై సీరియస్ అవ్వాల్సి వస్తోంది. తనతో సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు అయినా సరే.. ప్రజల్లోకి వెళ్లకపోతే వాళ్లకు వార్నింగ్ ఇస్తున్నారట.