Wife – Husband Story : ఈ మధ్య చాలామందికి చాలా రకాలుగా సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది భర్తలు.. భార్యలపై పలు రకాల కామెంట్లు చేస్తుంటారు. లావుగా ఉన్నారని, లేదంటే పొట్టిగా ఉన్నారని కామెంట్లు చేస్తుంటారు. ఇటువంటి వ్యాఖ్యలను కొందరు లైట్ తీసుకుంటారు కానీ.. మరికొందరు మాత్రం చాలా సీరియస్ అవుతారు. కొందరు లోలోపల బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే.. బరువు, రంగు, బాడీపై ఎగతాళి చేస్తే చాలామంది బాధపడతారు. లోలోపల ఫీల్ అవుతారు. డిప్రెషన్ కు లోనవుతారు. ఓ యువతి కూడా తన భర్త తనను పందిలా ఉన్నావని, ఏనుగులా ఉన్నావని ఎగతాళి చేస్తాడని చెప్పుకొచ్చింది.
తన బరువును చూసి, బాడీపై ఎగతాళి చేయడం అనేది ఎలా కరెక్ట్ అవుతుంది. పది మంది ముందు, కుటుంబ సభ్యుల ముందు, స్నేహితుల ముందు అవమానిస్తాడని చెప్పుకొచ్చింది. నన్ను ఎందుకిలా ఎగతాళి చేస్తావని అడిగితే.. నువ్వు బరువు తగ్గడం కోసమే నిన్ను ప్రోత్సహిస్తుంటాను అంటూ ఆయన చెబుతుంటాడు. ఇది బాడీ షేమింగ్ కాదా అంటూ ఓ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అసలు ఆయన మాటలకు నా మీద నాకే నమ్మకం పోతోంది అంటూ చెప్పుకొచ్చింది. అయితే.. మహిళల్లో ప్రెగ్నెన్సీ తర్వాత శారీరక మార్పులు రావడం సహజం. ఒక బిడ్డకు జన్మనిచ్చాక శరీరంలో చాలా మార్పులు వస్తాయి.

ప్రెగ్నెన్సీ తర్వాత శారీరక మార్పులు రావడం సహజం
అవన్నీ మగవాళ్లకు తెలిసి ఉండాలి. అప్పుడే వాళ్ల సంసారం సజావుగా నడుస్తుంది. బరువు పెరగడం అనేది డెలివరీ తర్వాత ప్రతి మహిళకు ఉండే సమస్యే. దాన్ని అడ్డం పెట్టుకొని భర్తలు.. భార్యలను వేధించడం కరెక్ట్ కాదు. ఏ సమస్యను అయినా మనం పరిష్కరించుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. దానికోసం పాజిటివ్ గా ఆలోచించాలి. అందుకే.. భర్తలు ఈ విషయంపై భార్యలను ఎగతాళి చేయకుండా వాళ్లకు అర్థం అయ్యేలా చెప్పి.. బరువు ఎలా తగ్గాలో మార్గాలు చెప్పి వాళ్లు బరువు తగ్గేలా పలు సూచనలు చేయాలి. దానికి తగ్గ ప్రణాళికలను రచించాలి. అంతే కానీ.. ఇలా భార్యను ఇలా ఇబ్బంది పెట్టకూడదు అంటూ నెటిజన్లు ఆ భర్తకు సలహాలు ఇస్తున్నారు.