Election Surveys : ఎన్నికలు అంటే చాలు.. పార్టీలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడతాయి. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న పార్టీలు, నాయకులు ఒక్కసారిగా అలర్ట్ అవుతారు. వెంటనే తమ పరిధిలోని నియోజకవర్గాల్లో సర్వేలు చేయించడం, ప్రచారాలు ఒక్కొక్కటిగా ప్రారంభం అవుతూనే ఉంటాయి. నామినేషన్ జరిగినప్పటి నుంచి ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేదాకా అక్కడ ఉండే హడావుడే వేరు. ఎన్నికల ముందు ప్రీ ఎగ్జిట్ పోల్స్ అంటారు.. ఎన్నికలు జరిగాక పోస్ట్ ఎగ్జిట్ పోల్స్ అంటారు. కొన్ని పార్టీలు సొంతంగా సర్వేలు చేయించుకుంటాయి. ఇలా.. రకరకాల సర్వేలతో రచ్చ రచ్చ చేస్తారు. అయితే.. ఈ సర్వేలు ఎంత వరకు నిజం అవుతాయి అనేది చెప్పడం మాత్రం కష్టం.
ఎందుకంటే అన్నిసార్లు సర్వే ఫలితాలు నిజం అవ్వాలన్న గ్యారెంటీ అయితే అస్సలు లేదు. ఒక్కోసారి నిజం అవ్వొచ్చు.. కాకపోవచ్చు. కానీ.. రాజకీయ పార్టీలు మాత్రం తాము చేయించుకున్న సర్వేలు కానీ.. వేరే సర్వే సంస్థలు చేసిన సర్వేలు కానీ అవే నిజం అనుకొని వాటినే నమ్ముతాయి. ఏదైనా సర్వే సంస్థ ఒక పార్టీ గెలుస్తుందని చెబితే ఇక దాన్నే నమ్ముతాయి. ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక హడావుడి నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత బీజేపీలో చేరాడు. దీంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యం అయింది. మునుగోడు అంటేనే కాంగ్రెస్ కంచుకోట.

Election Surveys : గుడ్డిగా సర్వేలను నమ్మొచ్చా?
కానీ.. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొన్నది. ఇంకా ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు కానీ.. ఇప్పటికే ప్రచారాల హోరు మాత్రం పెరిగింది. అలాగే.. ఎన్నికలపై సర్వేలు కూడా చేస్తున్నారు. సర్వేల్లో బీజేపీదే విజయం అని తేలింది అని బండి సంజయ్ కూడా స్పష్టం చేశారు. కేవలం సర్వేల మీద ఆధారపడి.. సర్వే ఏది చెబితే అది ఎలా రాజకీయ నాయకులు ప్రజలకు చెబుతారు. సర్వేల్లో నూటికి నూరు శాతం జరుగుతుందా? అంతా తెలిసి కూడా సర్వేల మీద నెట్టి.. మా పార్టీయే గెలుస్తుంది అని అలా ఎలా నమ్మకంతో ఉంటారు అని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి మునుగోడు ఉపఎన్నికలో ఏం జరుగుతుందో?