Harish Rao : తెలంగాణలో చాలామంది రాజకీయ నాయకులు ఏపీని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ఏపీలో అది జరగడం లేదు.. వాళ్లు అది ఇవ్వడం లేదు.. ఇది ఇవ్వడం లేదు.. మేము ఇస్తున్నాం కదా అంటూ చెబుతున్నారు. ఉదాహరణకు ఆంధ్రాలో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నారా? కానీ.. మేము ఇస్తున్నాం అంటూ టీఆర్ఎస్ నేతలు ఏపీతో తెలంగాణను చాలా విషయాల్లో పోల్చుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ టీఆర్ఎస్ నేతలు ఏపీ గురించి అన్ని వ్యాఖ్యలు చేస్తున్నా.. ఏపీ నేతలు మాత్రం నోరు విప్పడం లేదు.
ఇటీవల తెలంగాణ మంత్రి హరీశ్ రావు కూడా ఓ మీటింగ్ లో మాట్లాడుతూ ఏపీలో రైతులకు కరెంట్ సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. అక్కడి ప్రభుత్వం సరిగ్గా కరెంట్ ఇవ్వకున్నా… తెలంగాణలో మేము 24 గంటలు రైతులకు వ్యవసాయం కోసం కరెంట్ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. అంటే ఇది ఇన్ డైరెక్ట్ గా ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ కు కౌంటర్ అన్నమాట. అంత మాట అన్నా కూడా అటు వైసీపీ నేతలు కానీ.. ఏపీ ప్రభుత్వం కానీ.. తెలంగాణ మంత్రి మాటలకు కౌంటర్ ఇవ్వలేకపోయారు. కానీ.. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాత్రం మంత్రి హరీశ్ రావుపై ఫైర్ అయ్యారు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నారా? ఎక్కడ ఇస్తున్నారు..

Harish Rao : తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎక్కడిస్తున్నారని ప్రశ్నించిన రఘునందన్
కాస్త చెబుతారా? ఒకవేళ నిజంగానే 24 గంటల కరెంట్ ఇస్తున్నారని హరీశ్ రావు చెప్పినట్టుగా నిరూపిస్తే నేను ఇప్పుడు ఎలాంటి శిక్షకైనా సిద్ధం అంటూ రఘునందన్ రావు సవాల్ విసిరారు. అసలు.. రైతులు ఎక్కడ మంత్రికి కనిపించి 24 గంటలు కరెంట్ వస్తుందని చెప్పారో అంటూ ప్రశ్నించారు. నిజానికి.. రాష్ట్రంలో 9 గంటల కరెంటే వ్యవసాయానికి వస్తోందని రఘునందన్ రావు స్పష్టం చేశారు. మరి.. హరీశ్ రావు.. రఘునందన్ రావు సవాల్ ను స్వీకరిస్తారా? తెలంగాణలో 24 గంటలు రైతులకు కరెంట్ ఇస్తున్నామని చెబుతారా? దీనిపై హరీశ్ రావు నిర్ణయం ఎలా ఉండబోతోంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.