Chandrababu – Pawan Kalyan : ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ. ఈ పార్టీ గెలిచింది ఒకేసారి. కానీ.. ఏపీలో ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకోవడానికి కారణమైంది. ఏపీలో మూడు రాజధానుల దగ్గర్నుంచి పేద ప్రజల కోసం తీసుకొచ్చిన పలు సంక్షేమ పథకాలు కావచ్చు, ఇతర అభివృద్ధి విషయాల్లో కావచ్చు.. ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా కొత్తగా ఉంది. ఏపీ సీఎంగా వైఎస్ జగన్ సూపర్ సక్సెస్ అయ్యారు. ముఖ్యమంత్రిగా కొత్త.. మరి ఎలా తన పదవికి న్యాయం చేస్తారో అని అందరూ భావించారు కానీ.. ఎంతో అనుభవం ఉన్న నేతలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు జగన్.
ఇప్పుడు ఇదే ప్రతిపక్ష పార్టీలకు మైనస్ అయింది. ఎందుకంటే.. ఒక నేత తన పదవిలో సక్సెస్ అయ్యాడు అంటే నెక్స్ ట్ టైమ్ కూడా అతడు మళ్లీ ప్రజల మద్దతును పొందే అవకాశం ఉంటుంది. మళ్లీ గెలిచే అవకాశం ఉంటుంది. మరి.. ప్రతిపక్ష పార్టీలు చూస్తూ ఊరుకుంటాయా? ఎలాగైనా అధికార పార్టీని ఓడించాలని ప్లాన్లు వేస్తాయి. ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీ చేస్తోంది అదే. రెండు పార్టీల లక్ష్యం ఒక్కటే. అధికార వైసీపీని ఓడించడం. దాని కోసం రెండు పార్టీలు కలుస్తాయా? రెండు పార్టీలు ఒక్కటై.. వైసీపీని ఓడిస్తాయా అనేదే పెద్ద సస్పెన్స్ గా మారింది.

Chandrababu – Pawan Kalyan : పొత్తులు కుదరాలంటే ఇద్దరూ ఒక మెట్టు దిగాల్సిందే
టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదరాలంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒక మెట్టు కిందికి దిగాలి. ఒక చోట నెగ్గాలంటే మరో చోట తగ్గినా పర్వాలేదు అని పెద్దలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొత్తుల గురించి ఇంకా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెద్దగా ఆలోచించడం లేదు. ఒకవేళ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినా టికెట్ల విషయంలో గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చంద్రబాబు టికెట్స్ కన్ఫమ్ చేశాడు. ఈనేపథ్యంలో ఒకవేళ జనసేనతో పొత్తు పెట్టుకుంటే సీట్ల సర్దుబాటు విషయంలో చంద్రబాబుకు, జనసేనకు సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో చంద్రబాబు, పవన్ ఇద్దరూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.