YS Sharmila : మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి. మీకు నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా? గుర్తు పెట్టుకో కేసీఆర్.. నా పేరు వైస్ షర్మిల. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను. పులి బిడ్డను.. నాకేం భయం. ఈ బేడీలు నన్ను ఆపలేవు. రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారు. నన్ను కూడా చంపుతారా? నేను బతికినంత కాలం, నా ఊపిరి ఉన్నంత కాలం నన్ను ప్రజల నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు. నన్ను ఆపడం నీ తరం కాదు. నీ అవినీతి పాలన గురించి మాట్లాడం ఆపను.. నా గొంతు నువ్వు నొక్కలేవు. మీ పనోళ్లు ఉన్నారు కదా. పోలీసులను ఎలా పనోళ్లుగా వాడుకుంటున్నావో అందరూ చూస్తున్నారు. వాళ్లను పంపి నన్ను అరెస్ట్ చేయించు. మీకు అంత దమ్ముందా? నీతో పోలీసులు ఉన్నారేమో కానీ..
నాతో ప్రజలు ఉన్నారు.. అంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.వైఎస్ షర్మిల చేసే వ్యాఖ్యలు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలను కించపరిచేలా ఉన్నాయంటూ ఇటీవల స్పీకర్ కు టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను అరెస్ట్ చేయబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆమె అరెస్ట్ కు సంబంధించిన విషయాల గురించే అందరూ చర్చించారు. ఈనేపథ్యంలో షర్మిల తాజాగా మీడియా ముందుకు వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

YS Sharmila : ఒక మహిళను ఎదుర్కోలేక స్పీకర్ కు ఫిర్యాదు చేస్తారా?
నీతో పోలీసులు ఉన్నారు కానీ.. నాతో ప్రజలు ఉన్నారు. నేను పాదయాత్రలో ఉన్నా. జనం మధ్య ఉన్నా. జనంతో ఉన్నా. జనం కోసం పోరాడుతున్నా. ఒక మహిళను ఎదుర్కోలేక స్పీకర్ కు ఫిర్యాదు చేస్తారా? అరెస్ట్ చేయాలని చూస్తున్నారా? నేడు రెడీగా ఉన్నాను. మీరు రెడీయా? మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి.. అంటూ మీడియా ముందు వైఎస్ షర్మిల సీరియస్ అయ్యారు. వైఎస్ షర్మిల వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వైఎస్సార్ ను కుట్ర చేసి చంపారు అంటూ తను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే లేపాయి.