YS Jagan : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతా కేసీఆర్ ( KCR )పెట్టిన జాతీయ పార్టీ గురించే చర్చ. కేసీఆర్ కేవలం మాటలే అంటున్నారు కానీ.. జాతీయ పార్టీ ఎలా పెడతారు అని అంతా అనుకున్నారు. కానీ.. చివరకు అందరికీ షాక్ ఇచ్చి జాతీయ పార్టీగా టీఆర్ఎస్ ను మార్చుతూ బీఆర్ఎస్ పార్టీని ప్రకటించారు కేసీఆర్. దీంతో పలు రాష్ట్రాల నాయకులు స్పందిస్తున్నారు. జాతీయ పార్టీ అయినందుకు జాతీయ పార్టీల నేతలు స్పందిస్తున్నారు.తాజాగా వైసీపీ జనరల్ సెక్రెటరీ సజ్జల రామకృష్ణారెడ్డి.. ఏపీ ప్రభుత్వం తరుపున, ఏపీ సీఎం వైఎస్ జగన్ ( ys jagan ) తరుపున బీఆర్ఎస్ పార్టీపై స్పందించారు.
కొత్త పార్టీల గురించి ఆలోచించే పరిస్థితిలో ప్రస్తుతం తాము లేము. ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఎవరైనా పార్టీ పెట్టుకునే స్వతంత్రం ఉందని సజ్జల స్పష్టం చేశారు.ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడం సహజం అన్న సజ్జల, ప్రజా అజెండాతో పార్టీలు వచ్చి పని చేస్తే జనానికి మంచిదని సజ్జల రామకృష్ణారెడ్డి( sajjal rama krishna reddy ) తెలిపారు. ఏదైనా తేల్చాల్సింది ప్రజలే. కొత్త పార్టీల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మేం ఆటగాళ్లం. మా గేమ్స్ రూల్స్ ప్రజా అజెండా మేరకే ఉంటాయి. ఏపీలోకి ఏ పార్టీ అయినా రావచ్చు.

YS Jagan : కొత్త పార్టీలు రావడం సహజం
ప్రజల్లో మాకు పాజిటివ్ ఇంపాక్టే ఉంది. ఒక అన్నలా తమ్ముడి గురించి చిరంజీవి (chiranjeevi ) మాట్లాడారు. కొత్త పార్టీలు రావడం సహజం.. అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అంటే.. సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పర్టీపై ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదని, అసలు ఆ పార్టీ గురించి ఎలాంటి ప్రభావం ఉండదని తాము భావిస్తున్నట్టు తెలుస్తోంది.