Bandi Sanjay : టీ‌ఆర్‌ఎస్ ని ఓడించడం కోసం బండి సంజయ్ పెద్ద స్కెచ్ వేశాడే

Advertisement

Bandi Sanjay : బండి సంజయ్ తెలుసు కదా. బీజేపీకే ఫైర్ బ్రాండ్ ఆయన. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఓడించి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయన ఎంతో శ్రమిస్తున్నారు. దాని కోసం ఎన్ని ఎత్తుగడలు వేయడానికైనా సిద్ధపడుతున్నారు. సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా ఒక పార్టీని ఓడించాలంటే పలు ఎత్తులు వేయాల్సి ఉంటుంది. ఆ ఎత్తుల్లో భాగంగా ఓటర్లను ఆకర్షించడం లేదంటే పార్టీ గుర్తును పోలి ఉన్న గుర్తులు ఉన్న అభ్యర్థులను బరిలోకి దించడం.. ఇలా చాలా చేస్తుంటారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారును పోలి ఉన్న 8 గుర్తులను టీఆర్ఎస్ నేతలు గుర్తించారు. వెంటనే వాటిని తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. మునుగోడు ఉపఎన్నిక త్వరలో జరగనుండగా టీఆర్ఎస్ నేతలు దాస్యం వినయ్ భాస్కర్, భరత్ కుమార్, భాను ప్రసాద రావు.. రాష్ట్ర ఎన్నికల అధికారి అయిన వికాస్ రాజ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

Advertisement

అయితే.. కారును పోలినట్టుగా ఉన్న కెమెరా, డాలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కట్టు మిషన్, చపాతీ రోలర్, ఓడను వెంటనే ఎన్నికల గుర్తులు ఉన్న జాబితాలో నుంచి తీసేయాలని కోరారు. ఒకవేళ ఎన్నికల సంఘం దీనిపై 48 గంటల్లో స్పందించకపోతే వెంటనే కోర్టును ఆశ్రయిస్తామని టీఆర్ఎస్ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఇదివరకు ఇలా కారును పోలిన గుర్తులు ఉండటం వల్ల.. టీఆర్ఎస్ పార్టీ అని భ్రమ పడి కొందరు ఓటర్లు ఆ గుర్తులకు ఓట్లు వేశారని, తద్వారా స్వల్పమైన మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్థులు ఓడిపోయారని స్పష్టం చేశారు.

Advertisement
bjp president bandi sanjay sketch to defeat trs in munugodu
bjp president bandi sanjay sketch to defeat trs in munugodu

Bandi Sanjay :కారును పోలి ఉండటం వల్లే ఎక్కువ ఓట్లు

ఇదివరకు జరిగిన ఎన్నికల్లో చాలా చోట్ల కారును పోలి ఉన్న ఓట్లు ఎక్కువగా పడటం వల్ల స్వతంత్ర అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వచ్చాయని, దానికి కారణం… వాళ్ల ఎన్నికల గుర్తులు.. టీఆర్ఎస్ పార్టీ సింబల్ కారును పోలి ఉండటమేనన్నారు. అలాగే.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికి కూడా సీఎం కేసీఆర్ పై క్షుద్రపూజలు అంటూ పలు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ కి పిచ్చి లేసిందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ ను టీఆర్ఎస్ నేతలు కోరారు. దేవుడితో సమానమైన వ్యక్తి సీఎం కేసీఆర్. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ పార్టీకి పుట్టగతులు లేవని తెలిసి.. ఇలా సీఎం కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారని టీఆర్ఎస్ నేతలు తెలిపారు.

Advertisement