Chandrababu : ఎవరు అవునన్నా.. కాదన్నా కడప జిల్లా అంటేనే వైసీపీకి కంచుకోట. అసలు జిల్లా పేరు వైఎస్సార్ కావడం, వైసీపీకి అక్కడ ఉన్న ఆదరణను చూసి ఇతర పార్టీలు కూడా అక్కడ సీట్లను వదిలేసుకుంటున్నాయి. కడప జిల్లాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఉన్న అనుబంధం అటువంటిది. నిజానికి రాయలసీమ మొత్తం వైఎస్సార్ కుటుంబానికి మంచి పేరు ఉన్నప్పటికీ ఇక కడప జిల్లా మొత్తం వైఎస్ జగన్ అభిమానులే. అయితే.. ఎప్పుడూ పరిస్థితులు ఒకే విధంగా ఉండవు కదా. ఒక్కోసారి పరిస్థితులు మారుతుంటాయి. అయితే.. బలమైన చాలా సామాజిక వర్గాలు కడపలో ఉన్నా మైనారిటీలకు కూడా టికెట్లు ఇస్తూ వైసీపీ పార్టీ తమను పక్కన పెడుతోందని కొన్ని సామాజిక వర్గాల నేతలు బాధపడుతున్నారు.
ఎందుకంటే.. కడపలో వైసీపీ టికెట్ ను 2014 చి అంజద్ భాషాకే ఇచ్చారు జగన్. వచ్చే ఎన్నికల్లోనూ కడప టికెట్ ఆయనకే. అంతే కాదు.. ఆయన ఉపముఖ్యమంత్రి కూడా. ఆయనకే టికెట్ ఇవ్వడానికి కారణం.. మైనారిటీ సీట్లను తమ వైపునకు తిప్పుకోవడం. అందుకే.. మైనారిటీ టికెట్ నే వైసీపీ కన్ఫమ్ చేస్తోంది. అయితే.. ఓవైపు కుప్పం సీటు మీద వైసీపీ జెండా పాతాలని ప్రయత్నిస్తుంటే.. కడపలో వైఎస్ జగన్ అడ్డాలో టీడీపీ జెండాను పాతాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. అందుకే కడప అసెంబ్లీ సీటును ఎలాగైనా గెలవాలని టీడీపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. కడపలో ఎక్కువగా బలిజ సామాజిక వర్గం ఉంది.

Chandrababu : టీడీపీకి ఇదే అడ్వాంటేజ్ గా మారిందా?
50 వేల వరకు బలిజ ఓట్లు ఉన్నాయి. అంటే మొత్తం ఓట్లలో 25 శాతం ఓట్లు వీళ్లవే. వీళ్లలో చాలామంది వైసీపీపై అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బలిజలకే టికెట్ ఇవ్వాలని వైసీపీతో పాటు పలు ఇతర పార్టీలకు కూడా విన్నవించినట్టు తెలుస్తోంది. అందుకే టీడీపీ బలిజ సామాజిక వర్గం వైపు చూస్తోంది. టీడీపీ నుంచి బాలిశెట్టి హరిప్రసాద్ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నవారు. ఆయన స్థానిక టీడీపీ నేత. ఈసారి తనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తా అని ఆయన చంద్రబాబుకు మాటిచ్చారట. బలిజలకు టికెట్ ఇచ్చినా బీసీలు, మైనారిటీల సపోర్టు కూడా ఉంటుందని ఆయన చంద్రబాబుకు వివరించాడట. దీంతో జగన్ గడ్డ మీద టీడీపీ జెండాను ఎగురవేసేందుకు చంద్రబాబు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.. కడప గడ్డ మీద ఎవరి జెండా ఎగురుతుందో?