Nellore Politics : నెల్లూరు టికెట్ కోసం రాత్రీ పగలూ కష్టపడుతోన్న మాజీ మంత్రి

Advertisement

Nellore Politics : 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే కదా. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్కుతో మంత్రులు అయిన వాళ్లలో పొంగూరు నారాయణ ఒకరు. ఆయన విద్యాసంస్థల అధినేత. కానీ.. చాలా ఏళ్ల పాటు టీడీపీలో యాక్టివ్ గా పనిచేశారు. అందుకే ఆయనకు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికల్లో మాత్రం ఆయన చాలా తక్కువ ఓట్ల శాతంతో ఓడిపోయారు. నెల్లూరు సిటీ నుంచి ఆయన పోటీ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ పై పోటీ చేసి ఓడిపోయారు. ఆఖరి రౌండ్ లో ఆయన ఓడిపోయారు.

Advertisement

నిజానికి నెల్లూరు సిటీలో ఖచ్చితంగా గెలవాల్సిన సీటు ఆయనది. అంతలా ఆయనే కాదు.. అందరూ నమ్మకంతో ఉన్నారు. చంద్రబాబు కూడా ఖచ్చితంగా అక్కడ నారాయణే గెలుస్తారు అని అనుకున్నారు. కానీ.. కేవలం 2 వేల ఓట్ల మెజారిటీతో అనిల్ గెలిచాడు. అప్పటి నుంచి నారాయణ రాజకీయాలకు దూరం అయిపోయారు. ఓడిపోవడంతో టీడీపీలోనూ అంతగా యాక్టివ్ లో లేరు. కానీ.. ఇంకో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈనేపథ్యంలో మళ్లీ టీడీపీ పుంజుకుంది. సీఎంగా జగన్ తన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించడం లేదనే అభిప్రాయం కొన్ని సెక్టార్ల ప్రజల్లో వినిపిస్తున్న కారణంగా ప్రస్తుతం టీడీపీ యాక్టివ్ అయింది.

Advertisement
former minister narayana to contest from nellore city from tdp
former minister narayana to contest from nellore city from tdp

Nellore Politics : మళ్లీ తెరమీదికి వచ్చిన నారాయణ

దీంతో మళ్లీ నారాయణ తెర మీదికి వచ్చారు. రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలంతా తమ దృష్టి ఎన్నికల మీదనే నిలిపారు. రాష్ట్రమంతా చంద్రబాబు కూడా టీడీపీ నేతలతో చర్చిస్తున్నారు. ఈనేపథ్యంలో నెల్లూరు రాజకీయాల్లోకి నారాయణ ఎంటర్ అయ్యారు. నెల్లూరు సిటీ స్థానం నుంచి మళ్లీ టీడీపీ తరుపున నారాయణ పోటీ చేయనున్నారు. ఈనేపథ్యంలో ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసితో నారాయణ ఉన్నారు. అందుకే.. ఇప్పటి నుంచే నెల్లూరులో యాక్టివ్ గా ఉంటూ ప్రజలతో మమేకం అవుతున్నారు. చూద్దాం మరి.. ఈ సారైనా నారాయణ నెల్లూరులో కాలు మోపుతారా? లేదా? అని.

Advertisement