YSRCP : మూడు రాజధానులకు మద్దతుగా వైజాగ్ లో నిన్న వైసీపీ నిర్వహించిన గర్జన సభ అట్టర్ ఫ్లాప్ అయినట్టు తెలుస్తోంది. దానికి కారణం.. వైసీపీ గర్జన సభకు, ర్యాలీకి జనాలు రాలేదు. ప్రజలు కావాలనే స్వచ్ఛందంగా ర్యాలీకి రాలేదని అంటున్నారు. మీడియాలోనూ అవే కథనాలు వచ్చాయి. దీంతో వైసీపీ ఉత్తరాంధ్ర నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వచ్చిన కొందరు అయినా ఎందుకు వచ్చారు.. అనే దానిపై ప్రస్తుతం వైసీపీ నేతలు ఆరా తీస్తున్నారట. మీడియాలో వచ్చిన వార్తలను చూసి వైజాగ్ కే చెందిన ఓ మంత్రి.. అసలు కలెక్టర్ కు ఫోన్ చేసి అసలు ఎవరు వచ్చారో వాళ్ల వివరాలు చెప్పాలంటూ అడిగినట్టు తెలుస్తోంది.
ఓవైపు జోరుగా వర్షం కురుస్తున్నా అక్కడే ఎందుకు నిలబడ్డారు… వాళ్లంతా వైసీపీ మీద అభిమానంతోనే గర్జనకు వచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నిజానికి.. నిన్న కంటిన్యూగా వైజాగ్ లో వర్షం కురిసింది. విశాఖ గర్జన నిర్వహిస్తున్న సమయంలోనూ వర్షం కురిసింది. నిజానికి లక్ష మందితో విశాఖ గర్జనను నిర్వహించాలని నాన్ పొలిటికల్ జేఏసీ భావించినా 15 వేల మంది కూడా గర్జనకు హాజరుకాలేదు.

YSRCP : కాలేజీ విద్యార్థులే అధికంగా వచ్చారా?
కాలేజీ విద్యార్థులే అధికంగా ఈ గర్జనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారట. దీంతో కాలేజీ విద్యార్థులంతా బస్సుల్లో వచ్చి ర్యాలీ ప్రారంభం కాగానే వెళ్లిపోయారు. మరోవైపు డ్వాక్రా మహిళలు కూడా వచ్చారు. వర్షం పెద్దగా పడటంతో అక్కడి నుంచి అందరూ వెళ్లిపోయారు. చివరకు ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ల అనుచరులే అని తెలుస్తోంది. వైజాగ్ కు మూడు రోజుల పర్యటన కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలకడానికి మాత్రం అభిమానులు చాలామంది రోడ్డు మీదికి వచ్చారు. అభిమానులకు ఆయన అభివాదం చేసి అక్కడి నుంచి హోటల్ కు వెళ్లిపోయారు. కానీ.. వైసీపీ గర్జనకు చాలా తక్కువ మంది రావడంపై వైసీపీ నేతలు మాత్రం తర్జన భర్జన పడుతున్నారు.