KA Paul : ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా మునుగోడు ఉపఎన్నిక గురించే చర్చ. త్వరలో మునుగోడు ఉపఎన్నికలో జరగబోతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ అక్కడే మకాం వేశాయి. ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశాయి. అయితే.. బీజేపీ తరుపున పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు తారసపడ్డారు. దీంతో ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. అలయ్ బలయ్ చేసుకున్నారు.
ఆ తర్వాత కేఏ పాల్ మాట్లాడుతూ… మునుగోడులో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని, గెలిపించాలని కేఏ పాల్.. రాజగోపాల్ రెడ్డిని కోరారు. తమ పార్టీని గెలిపిస్తే మునుగోడును అమెరికా చేస్తానని, నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానంటూ కేఏ పాల్ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్ ను చూసి రాజగోపాల్ రెడ్డి ఖంగుతిన్నారు. ఓవైపు తన గెలుపు కోసం బీజేపీ నేతలంతా కృషి చేస్తుంటే.. కేఏ పాల్ ఏంటి.. తన మద్దతు అడుగుతున్నారు అంటూ బిక్కమొహం వేశారు.

KA Paul : మునుగోడులో ప్రజాశాంతి పార్టీ నుంచి పోటీ చేస్తున్న గద్దర్
అయితే.. మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ప్రజాశాంతి పార్టీ కూడా పోటీ చేస్తోంది. ప్రజాశాంతి పార్టీ తరుపున గద్దర్ పోటీ చేస్తున్నారు. నిజానికి.. నామినేషన్ సమయంలో ప్రజా శాంతి పార్టీ నుంచి వేసిన గద్దర్ నామినేషన్ తిరస్కరణకు గురయింది. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా కేఏ పాల్ వేసిన నామినేషన్ తో గద్దర్ బరిలోకి నిలిచారు. తాజాగా కేఏ పాల్ ప్రచారాన్ని మునుగోడులో ముమ్మరం చేశారు. చండూరులో తాజాగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కోమటిరెడ్డి కూడా అక్కడే ప్రచారం నిర్వహిస్తూ అక్కడ తారసపడ్డారు.
దీంతో ఇద్దరూ కలిసి కాసేపు మాట్లాడుకున్నారు. ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకొన్నారు. కేఏ పాల్ ను చూడగానే బీజేపీ కార్యకర్తలు జై బీజేపీ అంటూ నినాదాలు చేశారు. కాసేపు బీజేపీ ప్రచారంలో కలిసి అడుగు వేశారు పాల్. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. మునుగోడులో తనను గెలిపిస్తే.. కేవలం ఆరు నెలల్లోనే ఏడు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు. ఒకప్పుడు అడవిగా ఉన్న హైదరాబాద్ ను తానే డెవలప్ చేశా అని కేఏ పాల్ ఈసందర్భంగా చెప్పుకొచ్చారు.