Nara Lokesh : ఏపీ రాజకీయలు ప్రస్తుతం హీటెక్కుతున్నాయి. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి కదా. అందుకే రాజకీయాలు మాంచి కాక మీద ఉన్నాయి. అసలే ఓవైపు మూడు రాజధానుల అంశం ఏపీని తలకిందులు చేస్తోంది. మరోవైపు ఒకే రాజధాని అంటూ అమరావతి రైతులు మహా పాదయాత్ర చేస్తున్నారు. దానికి నిదర్శనంగా ఇవాళ అంటే అక్టోబర్ 15న మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ వైజాగ్ లో భారీ ర్యాలీ నిర్వహించింది. ఇవాళే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్.. ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాల్లో పర్యటించారు.
వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో నారా లోకేశ్ పర్యటించారు. కడప టీడీపీ ఇన్ చార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ ఇన్ చార్జ్ ఇంటికి వెళ్లి ధర్నా చేసి వైసీపీ నేతలు దాడికి దిగినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు పంపించారు.

Nara Lokesh : వైసీపీ నేతలపై చర్యలు తీసుకోకుండా టీడీపీ నేతలపై ఏంటి దౌర్జన్యం
వైసీపీ నేతలు టీడీపీ నేతల మీద దాడులు చేస్తే.. వైసీపీ నేతల మీద చర్యలు తీసుకోకుండా టీడీపీ నేతల మీద కేసులు పెట్టడం ఏంటి.. జైలులో పెట్టడం ఏంటంటూ నారా లోకేశ్ ఇప్పటికే మండి పడిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ కడపలో పర్యటించారు వైఎస్ జగన్. సెంట్రల్ జైలులో ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు. అలాగే.. ప్రవీణ్ కుమార్ రెడ్డిని విడుదల చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. టీడీపీ నేతలను కావాలని టార్గెట్ చేసి వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని, దాని కారణం.. తమ పార్టీకి లభిస్తున్న ఆదరణే అని నారా లోకేశ్ మండిపడ్డారు. కేవలం పోలీసులకు టీడీపీ నేతలే కనిపిస్తున్నారా? వైసీపీ నేతలు ఎందుకు కనిపించడం లేదంటూ ప్రశ్నించారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ టీడీపీ నేతను అరెస్ట్ చేసినా ఏకంగా టీడీపీ హైకమాండ్ కదులుతోంది. అయితే.. చంద్రబాబు లేదంటే నారా లోకేశ్ వెళ్లి టీడీపీ నాయకులకు భరోసా కల్పిస్తున్నారు.