Ntr : సినీ పరిశ్రమలో పవర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలలో కూడా సత్తా చాటాలని అనుకుంటున్నారు. జనసేన ఆవిర్భవించి సుదీర్ఘ కాలమవుతోంది. 2014 ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో టీడీపీకి పవన్ మద్దతు ఇచ్చారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో పవన్ మద్దతు తెలిపిన రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. దీంతో పవన్ కు తిరుగులేదని.. ఆయనకు కేంద్రంలో, రాష్ట్రంలో మంచి పదవులకే దక్కుతాయని అంతా భావించారు. కాని ఆయన అలాంటివేమి ఆశించలేదు. తన పని తాను చేసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఎన్నో సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించగలిగారు.
2019 ఎన్నికల్లో అన్ని పార్టీలకు సమదూరం పాటిస్తూ పోటీచేశారు. కానీ నిరాశే ఎదురైంది. పరాజయం చవిచూశారు. చివరకు తాను పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోయారు. దీంతో జనసేనను ఏదో పార్టీలో విలీనం చేస్తారన్న ప్రచారం జరిగింది. దానిని చెక్ చెబుతూ పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు. ఆరు నూరైనా, నూరు 150 అయినా.. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా చూస్తాను అని పవన్ చేసిన ప్రకటన రాజకీయవర్గాల్లో ఇంకా రగులుతూనే ఉంది. ఈ ప్రకటన తర్వాత ఏపీలో పొత్తులపై అందరికీ ఆసక్తి పెరిగింది. సర్కార్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే.. పవన్ టీడీపీతో కలిసి వెళితేనే అది సాధ్యమవుతుందన్న అభిప్రాయాలు వచ్చాయి.

Ntr : ఎన్టీఆర్ సపోర్ట్..
పవన్ మాత్రం సొంతంగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. అయితే ఈ సారి పవన్ సీఎం కావడం పక్కా అని ప్రచారాలు జరుగుతుండగా, జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే బేస్ తో మాట్లాడారట. పవన్ ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని.. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయితే ఏపీ ప్రజలకు మంచి జరుగుతుందని ఎన్టీఆర్ అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల టీడీపీ నాయకులు కొందరు ఎన్టీఆర్‌పై కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఇలా రియాక్ట్ అయ్యాడా అని కొందరు అంటున్నారు.