NTR : ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు ఆరోపణల చేసుకుంటున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్పై తెలుగు దేశానికి చెందిన ఓ మహిళ మండిపడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏపీలో అమరావతి రాజధాని సాధన కోసం రైతులు మహా పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో ఓ బామ్మ కూడా పాల్గొంది. ఈ పాదయాత్రలో భాగంగా ఆమెను ఓ రిపోర్టర్ పలకరించగా.. జూనియర్ ఎన్టీఆర్ ని తిట్టడం ప్రారంభించింది.
ఎన్టీఆర్ మనవడిని అని చెప్పుకుంటాడు. నువ్వు ఎన్టీఆర్ మనవడివైతే.. రా ముందుకు రా. మీ తాతని అవమానిచ్చినప్పుడు.. నువ్వు ఎందుకు బయటకీ రావు, అలా రానప్పుడు ఇక నువ్వు ఉంటే ఏంటి? చస్తే ఏంటి? మేమే లాక్కొస్తాం టీడీపీని’ అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిజానికి పేరు మార్పు వ్యవహారం మీద ఎన్టీఆర్ కాస్త కర్ర విరగకుండా పాము చావకుండా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ పేరు మార్చి వైయస్సార్ పేరు పెట్టడాన్ని ఆయన ఖండించకపోగా ఒకరి పేరు మార్చి మరొకరి పేరు పెడితే ఒకరు గౌరవం తగ్గదు మరొకరికి గౌరవం పెరగదు అంటూ కామెంట్ చేశారు.

NTR : చిన్న ఝలక్..
నువ్వు ఉంటే ఏమీ చస్తే ఏమి.. మా తెలుగు దేశాన్ని మేమే లాక్కొచ్చుకుంటాం.. అంటూ ముసలావిడ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనపై ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్పందించింది. రైతుల తీరును తప్పుపట్టారు. ఏ మాత్రం సంబంధం లేని జూనియర్ ఎన్టీఆర్ను అనవసరంగా రాజకీయాల్లోకి లాగొద్దంటూ మండిపడుతున్నారు. ఇదివరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు సమయంలో కూడా జూనియర్పై తెలుగుదేశం పార్టీ నాయకులు ట్రోల్స్ చేశారని, ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితే తీసుకొచ్చారని మండిపడ్డారు.మరి ఈ వివాదం ఇంకెంత ముందుకు వెళుతుందో చూడాలి.