Pawan Kalyan : అక్టోబర్ 15న జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్వహించిన జనవాణి రసాభాసగా ముగిసిన విషయం తెలిసిందే. ఆరోజు సాయంత్రం వైజాగ్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలకడానికి వందలాది మంది జనసైనికులు వెళ్లారు. ఆసమయంలో వైసీపీ మంత్రులపై దాడి జరిగిందని.. పోలీసులు పలువురు జనసేన నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దానిపై పవన్ కళ్యాణ్ కూడా మండిపడ్డారు. ఎక్కడైనా వైసీపీ ప్రభుత్వంతో తేల్చుకోవడానికి రెడీ అని తేల్చి చెప్పారు. ఈనేపథ్యంలో మరోసారి వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ రెచ్చిపోయారు.
తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.తనను మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ మాట్లాడుతుండటంతో తట్టుకోలేక వైసీపీ నేతలపై ఘాటుగా స్పందించారు. నా కొడకల్లారా.. నేను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకేమి అభ్యంతరం. లాక్కొని తీసుకొచ్చి మరీ కొడతా.. మీరు కూడా కావాలంటే మూడు పెళ్లిళ్లు చేసుకోండి. ఇంకోసారి నా పెళ్లిళ్ల గురించి మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా.. అంటూ వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు.

Pawan Kalyan : చెప్పు చూపిస్తూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
మీకు మామూలుగా ఉండదు.. సన్నాసుల్లారా.. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే లాక్కొని వచ్చి కొడతా. ఏంట్రా మీరు.. మీ పిచ్చి మాటలు. ఒక్క పెళ్లి చేసుకొని 30 మంది స్టెపినీలతో తిరిగే మీరు నాకు చెబుతున్నారా? నేను విడాకులు ఇచ్చి చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. కావాలంటే మీరు కూడా చేసుకోండి.. అంటూ చెప్పు చూపిస్తూ పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోయారు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పు తీసుకొని కొతా. నా కొడకల్లారా.. రండి.. ఎక్కడికి వస్తారో.. ఇప్పటి వరకు నాలో ఉన్న మంచితనమే చూశారు. ఇప్పుడు నాలోని ఆవేశాన్ని చూస్తారు. తేల్చుకుందాం రండి. ఇంకా ఇలాగే వెధవ వాగుడు వాగితే ఇళ్లలో నుంచి బయటికి లాక్కొచ్చి మరీ కొడతా. ఈరోజు నుంచి నేను యుద్ధం మొదలుపెడుతున్నా. దేనితోనైనా నేను యుద్ధానికి సిద్ధం.. అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.