Pawan Kalyan : వైజాగ్ లో జనసేన పార్టీ నిన్న జనవాణి అనే కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ కార్యక్రమాన్ని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. జనసేన నేతలను అరెస్ట్ చేశారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. జనసేన పార్టీని ఇంతలా వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి త్వరలోనే వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
అయితే.. ప్రతిసారీ తన పర్సనల్ విషయాన్ని బయటికి తీస్తున్నారని, నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని అంటున్నారని, మీడియా కూడా అదే విషయాన్ని పదే పదే చెబుతోందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. నాకు సెట్ కాలేదు కాబట్టి.. కుదరలేదు కాబట్టి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను. ఇందులో తప్పేముంది. మీరు చేసుకోండయ్యా పెళ్లిళ్లు.. ఎందుకు ఊరిగే వాగుతారు.. సమస్యలపై మాట్లాడండి.. నా పెళ్లిళ్లపై కాదు.. అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Pawan Kalyan : పిచ్చి లాజిక్ లు.. సంబంధం లేని లాజిక్ లు మాట్లాడొద్దు
నేను మూడు సార్లు పెళ్లిళ్లు చేసుకున్నా.. అందుకని మూడు చోట్ల రాజధానులు పెట్టాలంటారా? చాలా అసూయ పడుతున్నా నేను.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నందుకు.. నాకు కుదరలేదు. పిచ్చి లాజిక్ లు.. సంబంధం లేని లాజిక్ లు మాట్లాడొద్దు. గొడవ కావాలనే, కొట్టుకు చావాలనే వైసీపీ ప్రభుత్వం చూసింది. అందుకే నేను సంయమనం పాటించా. వైసీపీ గుండాగిరీని ఇక సాగనివ్వం. నన్ను పోలీసులు చంపేస్తారని కనీసం నన్ను చేయి కూడా ఊపనివ్వలేదు. నన్ను చంపుతారనే వదంతులే నన్ను బాధించాయి కానీ.. నేను చావుకు భయపడేవాడిని కాదు. అరెస్ట్ చేసిన జనసేన నేతలను వదిలే వరకు నా పోరాటం కొనసాగుతుంది. దీనిపై ఎంత దూరం అయినా వెళ్తాం. న్యాయ పోరాటం చేస్తాం.. అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అయితే.. జనసేన నేతల అరెస్ట్ తో జనవాణిని రద్దు చేసినట్టు పవన్ కళ్యాణ్ ఈసందర్భంగా తెలిపారు.