Sri Reddy : శ్రీరెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలుసు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ శ్రీరెడ్డి ట్రేండింగ్ అవుతూ వస్తుంది. మరి ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వైసీపీకి అనుకూలంగా మాట్లాడేది శ్రీరెడ్డి. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ కు చెప్పు చూపిస్తూ మాట్లాడిన శ్రీ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్య పిల్లలకు మద్దతుగా నిలిచింది. పవన్ కళ్యాణ్ ప్రత్యర్ధులు పవన్ కళ్యాణ్ భార్య పిల్లలపై కామెంట్ చేసిన నేపథ్యంలో శ్రీ రెడ్డి మాట్లాడుతూ వైసిపి వాళ్లపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎప్పుడు వైసీపీకి సపోర్ట్ చేసే శ్రీ రెడ్డి సడన్ గా పవన్ కళ్యాణ్ సైడు మాట్లాడడంతో అందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇటీవల మంగళూరులో జరిగిన జనసేన పార్టీ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులపై విరుచుకుపడిన సంగతిి తెలిసిందే. ప్రశాంతంగా ఉండే పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తూ కొడకల్లారా, సన్నాసుల్లారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దానికి దీటుగా శ్రీ రెడ్డి బాట చెప్పు చూపిస్తూ పవన్ పై తిరగబడింది. జగనన్నే పవన్ కళ్యాణ్ కాపాడాలంటూ వ్యాఖ్యలు చేసింది. అలాంటి శ్రీరెడ్డి తాజాగా ఎవరు ఊహించని విధంగా వైసీపీ నాయకుడైన బొరుగడ్డ అనిల్ కుమార్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. వైసిపి పార్టీ నాయకుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆయన మాజీ భార్య పిల్లలను బూతులు తిడుతూ ఒక వీడియో విడుదల చేశారు. వారి ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు. ఈ వీడియో చూసిన శ్రీరెడ్డి తనదైన స్టైల్ లో గట్టి వార్నింగ్ ఇచ్చింది. నువ్వు ఏ పార్టీలో ఉన్నా సరే ఎంతటి స్థాయిలో ఉన్నా సరే ,ఆడవాళ్ళ జోలికి , పిల్లలు జోలికొస్తే తొక్క తీస్తా నా కొడకా అంటూ అనిల్ కుమార్ కు దీటుగా జవాబు చెబుతూ సోషల్ మీడియాలో వీడియో పెట్టింది.

ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వైయస్ఆర్ పై అభిమానంతో ఈ పార్టీని స్థాపించామని, కానీ ఈ పార్టీ పేరు చెప్పుకొని చాలామంది నాయకులు ఇలా చేస్తున్నారని ఇలాంటి వారిని జగనన్న అసలు ప్రోత్సహించడని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి.మగాడివైతే పార్టీ నాయకుడు గురించి మాట్లాడు వాడిని కించపరచు, కానీ వాడి పెళ్ళాం పిల్లలు ఏం చేశారురా ఇంకోసారి ఫ్యామిలీ జోలికి వస్తే నేను మాత్రం సహించను అంటూ కామెంట్ చేసింది శ్రీ రెడ్డి.మూడు పెళ్లిళ్లు చేసుకుని వదిలేసింది వాడు కావాలంటే వాడిని తిట్టు , ఆయన భార్య పిల్లల్ని తిట్టే అధికారం నీకు ఎక్కడిది రా అంటూ, నీలాంటి వారి వల్లనే ఈ పార్టీకి చెడ్డ పేరు వస్తుందంటూ చెప్పుకొచ్చింది. ఇలాంటి వాళ్లు పార్టీలో అసలు ఉండకూడదు , ఈ విషయం జగనన్నకు తెలియాలి. పోలీసులు వీడి పై యాక్షన్ తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదిక గా వీడియో లో చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి.