Janasena – BJP : జనసేన, బీజేపీ మధ్య బంధం సంగతి తేలిపోయిందిగా..!

Advertisement

Janasena – BJP : ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఇంకా 18 నెలల సమయం ఉంది. అందుకే ఇప్పటి నుంచే పొత్తులు ఎందుకు అనే భావనలో ఉన్నాయి కొన్ని పార్టీలు. అందుకే కొన్ని సైలెంట్ గా ఉన్నాయి. అంత మాత్రాన ఏపీలో పొత్తులు ఉండవు అనేది లేదు. ఇప్పటికే బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. కానీ.. ఆ పొత్తు అసలు ఉందా లేదా అనేదానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎలాగూ ఒంటరిగానే పోటీ చేస్తుంది. మరే ఇతర పార్టీతో పొత్తు పెట్టుకోదు. 2019 ఎన్నికల్లోనూ వైసీపీ పార్టీ పొత్తులు పెట్టుకోకుండానే గెలిచింది. వచ్చే ఎన్నికల్లోనూ అదే ఫాలో అవబోతోంది.

Advertisement

కానీ.. ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ, బీజేపీ, జనసేన మాత్రం ఇంకా పొత్తుల గురించి ఏం క్లారిటీ ఇవ్వడం లేదు. జనసేన.. బీజేపీతో అప్పట్లోనే పొత్తు ఖరారు చేసుకుంది. పలు సందర్భాల్లో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. కానీ.. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆ పొత్తుపై క్లారిటీ ఇచ్చేశాయి. దానికి కారణం.. టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కావడం. అయితే.. వైసీపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు ఒక్కటవుతాయనే వార్తలు అయితే ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి.

Advertisement
sunil deodhar says about alliance with tdp in next-elections
sunil deodhar says about alliance with tdp in next-elections

Janasena – BJP : వైసీపీ గద్దె దించేందుకు ప్రతిపక్షాలు ఒక్కటవుతాయా?

అంతే కాదు.. చంద్రబాబు కూడా అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో అసలు ఏపీలో పొత్తులపై ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ సునీల్ దేవ్ ధర్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. కేవలం బీజేపీ, జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తాయని, టీడీపీతో పొత్తు మాత్రం ఉండదని తెలిపారు. దీంతో పొత్తులపై ఏపీ ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసినట్టే. అలాగే.. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారాన్ని కూడా తాము అంతగా సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు సునీల్. వైసీపీ పార్టీపై మాత్రం పలు విమర్శలు చేశారు. ఓవైపు బీజేపీ, జనసేన కలిసి పని చేస్తుందని సునీల్ చెబుతున్నారు కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ కాకుండా టీడీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. లేదా.. మూడు పార్టీలు కలిసి పని చేసి వైసీపీని ఓడిస్తాయా? అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement