Raghurama Krishnamraju : జగన్ కి మరొక ట్విస్ట్ ఇచ్చిన రఘురామ కృష్ణం రాజు !

Advertisement

Raghurama Krishnamraju : రఘురామకృష్ణంరాజు గురించి తెలుసు కదా. వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలిచి ఆ తర్వాత పార్టీకే ఎదురు తిరిగి రెబల్ ఎంపీగా మారారు. ఢిల్లీలో ఉంటూ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఆయన నైజం. తాజాగా మరోసారి జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సీఐడీని టార్గెట్ చేశారు. తాజాగా తనను కస్టడీలో తీసుకున్నప్పుడు చిత్రహింసలు పెట్టిన ఐదుగురు పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ రఘురామ కోరారు. దానిపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లెటర్ రాశారు. వాళ్ల పేర్లను కూడా మెన్షన్ చేసి వాళ్లపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. వాళ్లలో గుంటూరు సీఐడీ కార్యాలయానికి చెందిన ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్, డీఐజీ సునీల్ నాయక్, ఏఎస్పీ విజయ్ పాల్, ఏఎస్ఐ పసుపులేటి సుబ్బారావు, కానిస్టేబుల్ మల్లేశ్వరరావు ఉన్నారు.

Advertisement

అయితే.. సీఎం జగన్ చెప్పడంతోనే వాళ్లు తనను వేధించారని ఆ లేఖతో రఘురామ పేర్కొన్నారు. అంతే కాదు.. వాళ్లపై ఇదివరకు ఉన్న కేసుల గురించి కూడా ఆయన ఆ లేఖలో వివరించారు. సునీల్ కుమార్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, గృహ హింస కేసు కూడా నమోదైందని అన్నారు. అలాగే.. విజయ్ పాల్ కూడా పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఓఎస్డీలుగా కొనసాగుతున్నారని తెలిపారు. తనకు సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల తర్వాతనే సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారని లేఖలో పేర్కొన్నారు.

Advertisement
sunil deodhar says about alliance with tdp in next elections
sunil deodhar says about alliance with tdp in next elections

Raghurama Krishnamraju : సభా హక్కుల కమిటీలకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఫిర్యాదు

ఈ విషయంపై తాను ఇప్పటికే సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేశానని, కానీ.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. అందుకే వెంటనే వాళ్లను పిలిచి విచారణ చేపట్టాలని కోరారు. లేదంటే పార్లమెంట్ పై ఉన్న గౌరవం తగ్గుతుందన్నారు. దీంతో వెంటనే ఆ లేఖపై ఇతర ప్రొసీడింగ్స్ కోసం స్పీకర్.. దాన్ని కేంద్ర హోంశాఖకు పంపించారు. మరోవైపు రఘురామ.. ఇప్పటి వరకు తన నియోజకవర్గానికి వెళ్లలేదు. ఢిల్లీలోనే ఉంటున్నారు. ప్రధాని మోదీ తన నియోజకవర్గానికి వచ్చినా కూడా ఆయన మాత్రం వెళ్లలేదు.

Advertisement