TDP : ఇంకో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈనేపథ్యంలో టీడీపీకి ఓ సీనియర్ నేత షాక్ ఇవ్వబోతున్నారు. అవును.. కేవలం వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయంలో ఎటూ తేల్చడం లేదని ఏకంగా ఆ నేత టీడీపీని వీడబోతున్నారట. వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వాలని లేకపోతే.. పార్టీకి రాజీనామా చేస్తానని ఆ నేత చంద్రబాబుకు చెప్పారట. ఇంతకీ ఆ నేత ఎవరు అంటారా? ఆయన ఎవరో కాదు.. రాయపాటి సాంబశివరావు. ఆయన మాజీ ఎంపీ.
వచ్చే ఎన్నికల్లో తనకు నరసరావుపేట ఎంపీ టికెట్ ఇవ్వాలని, తన కొడుకు రంగారావుకు సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చంద్రబాబుకు చెప్పారట రాయపాటి. అయితే.. ఒకే కుటుంబం నుంచి రెండు టికెట్లు ఇచ్చే విషయమై ఇప్పటి వరకు చంద్రబాబు ఆయనకు ఎటువంటి సమాధానం చెప్పలేదట. కనీసం టికెట్లు ఇస్తా.. లేదంటే ఇవ్వను అని కూడా చెప్పలేదట. దీంతో వేరే పార్టీ చూసుకోవడానికి రాయపాటి రెడీ అయినట్టు తెలుస్తోంది. తమకు ఇక టికెట్లు ఇస్తారనే నమ్మకాన్ని రాయపాటి ఫ్యామిలీ కోల్పోయిందట. అందుకే రాయపాటి సాంబశివరావు ప్రత్యామ్నాయాన్ని చూసుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది.

TDP : నరసరావుపేట ఎంపీగా యనమల అల్లుడు పోటీ?
నిజానికి చంద్రబాబు సీనియర్ల కుటుంబంలో ఒక్కరికే టికెట్ ఇస్తుంటారు. రెండు టికెట్లు ఇవ్వరు. అంటే తండ్రీకొడుకుల్లో ఒక్కరికే టికెట్ దక్కే అవకాశం ఉంది. మరోవైపు నరసరావుపేట ఎంపీగా యనమల రామకృష్ణుడు అల్లుడు పోటీ చేసేందుకు రెడీ అవడంతో రాయపాటికి ఎంపీ టికెట్ దొరికే అవకాశం తక్కువే అని చెప్పుకోవాలి. చంద్రబాబు కూడా యనమల అల్లుడికే ప్రాధాన్యత ఇస్తున్నారట. మరోవైపు సత్తెనపల్లిలో కూడా రాయపాటి కొడుకు రంగారావుతో పాటు మరో నలుగురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. దీంతో రంగారావుకు కూడా సత్తెనపల్లి నుంచి టికెట్ కన్ఫమ్ అయ్యే చాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. కనీసం ఒక్క టికెట్ కూడా ఇస్తా అనే మాట చంద్రబాబు నుంచి రాకపోవడంతో వైసీపీలోకి కాకుండా బీజేపీలో చేరాలని రాయపాటి కుటుంబం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే తండ్రీకొడుకులు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరుతారని అంటున్నారు. చూద్దాం మరి.. ఏం జరుగుతుందో.