TDP – YCP : ప్రస్తుతం రాయలసీమ మొత్తం వైసీపీకి కంచుకోట అయిపోయింది. ఎందుకంటే.. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది అంటే దానికి కారణం.. రాయలసీమలో వైసీపీకి వచ్చిన సీట్లే. వైసీపీకి ఉమ్మడి కర్నూలు జిల్లా కూడా కంచుకోటనే. ఎందుకంటే… ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిది అదే జిల్లా. అందులోనూ డోన్ నియోజకవర్గంలో వైసీపీ చాలా బలంగా ఉంది. అక్కడ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గనను ఢీకొట్టడమంటే మాటలు కాదు. అందుకే.. ఇతర పార్టీలకు ఆ నియోజకవర్గం చాలెంజింగ్ గా ఉంది.
2014 ఎన్నికల్లోనే కాదు.. 2019 ఎన్నికల్లోనూ వైసీపీ ఇక్కడ విజయం సాధించింది. రెండు సార్లు బుగ్గనే గెలిచారు. అయితే.. ఈసారి అక్కడ టీడీపీ జెండాను ఎలాగైనా ఎగురవేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు. అందుకే టీడీపీ తరుపున సుబ్బారెడ్డిని ఇన్ చార్జ్ గా చంద్రబాబు నియమించారు. అయినా ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. అక్కడ పోటీ చేసేది కూడా సుబ్బారెడ్డే అని చంద్రబాబు ముందే ప్రకటించేశారు. అయితే.. ఇప్పటి వరకు ఒక లెక్క. ఇప్పుడు ఇంకో లెక్క అన్నట్టుగా.. సుబ్బారెడ్డి ఎప్పుడైతే డోన్ లో అడుగుపెట్టారో పరిస్థితులు అన్నీ మారిపోయాయి.

TDP – YCP : డోన్ నియోజకవర్గం టఫ్ గా మారిందా?
అక్కడ రాజకీయాలు కూడా మారిపోయాయి. టీడీపీ తరుపున ఆయన చాలా కష్టపడుతూ టీడీపీని బలోపేతం చేస్తున్నారు. దీంతో అక్కడ కాస్త పార్టీ పుంజుకున్నట్టు కనిపిస్తోంది. డోన్ పట్టణం కాకుండా అక్కడ చుట్టూ ఉన్న గ్రామాలు వెనకబడి ఉండటంతో అక్కడ ప్రాంతాలు అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు సుబ్బారెడ్డి. అంటే తనను గెలిపిస్తే గ్రామాలపై దృష్టి పెడతానని ప్రజలకు చెప్పకనే చెప్పారు. వైసీపీ దేన్ని అయితే మిస్ అయిందో దాన్నే టీడపీ హైలెట్ చేసింది. అంతే కాదు.. సుబ్బారెడ్డి ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ టీడీపీ కార్యకర్తలను కూడా యాక్టివ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో టీడీపీకి అక్కడ బలం పెరగడంతో వైసీపీ కూడా వెంటనే అలర్ట్ అయింది. చూద్దాం మరి అక్కడ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో?