YS Jagan Cabinet : జగన్ క్యాబినెట్ లో వాళ్ళిద్దరికీ నో టికెట్ ?

Advertisement

YS Jagan Cabinet : ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మీదనే దృష్టి పెట్టాయి. చివరకు అధికార వైసీపీ పార్టీ కూడా ఎన్నికలపై ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోంది. అందులో భాగంగా సీఎం జగన్ ఇప్పటి నుంచే ఎవరికి టికెట్ ఇవ్వాలి.. ఎవరికి టికెట్ ఇవ్వకూడదు అనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే.. ప్రస్తుతం ఆయన కేబినేట్ లో మంత్రులుగా ఉన్న వాళ్లలో కొందరికి మాత్రం వచ్చే ఎన్నికల్లో టికెట్ లభించే అవకాశం లేనట్టు తెలుస్తోంది.

Advertisement

అయితే జగన్ కేబినెట్ లో మంత్రులకు టికెట్లు ఇవ్వకపోవడం ఏంటంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఇటీవలే కేబినేట్ ను జగన్ పునర్వ్యవస్థీకరించారు. మూడేళ్ల పాలన తర్వాత రెండో సారి మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు జగన్. ఆ సమయంలో కొందరిని తీసేసి మరికొందరికి మంత్రి పదవిని ఇచ్చారు జగన్. అయితే.. ఇప్పుడు మంత్రి వర్గం స్థానం పొందిన వారిలో కొందరికి వచ్చే ఎన్నికల్లో టికెట్స్ డౌటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సాధారణ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ సాక్షాత్తూ ఒక మంత్రికి టికెట్ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. కానీ.. ఇద్దరు మహిళా మంత్రులకు టికెట్ ఇవ్వడం కష్టమేనట.

Advertisement
these ministers may not get tickets from ycp in next elections
these ministers may not get tickets from ycp in next elections

YS Jagan Cabinet : వాళ్లిద్దరూ మహిళా మంత్రులేనా?

వాళ్లు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ కాగా, మరొకరు నగరి ఎమ్మెల్యే రోజా అని అంటున్నారు. వీళ్లిద్దరికీ ఇటీవలే జగన్ కేబినేట్ లో చోటు దక్కింది. అయితే.. ఈసారి వాళ్లకు టికెట్ ఇవ్వడం కష్టమే అంటున్నారు. బీసీ కోటాలో ఉషశ్రీ చరణ్ కు మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే. అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కదట. దానికి కారణం.. నియోజకవర్గంలో ఆమెకు వస్తున్న వ్యతిరేకతేనట. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్స్ ఇవ్వకూడదని జగన్ నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. అందులో ఉషశ్రీ చరణ్ కూడా ఉన్నారట. ఆ తర్వాత ఆర్కే రోజాకు కూడా టికెట్ దొరికే అవకాశం లేనట్టు తెలుస్తోంది. రోజాకు కూడా తన నియోజకవర్గంలో వ్యతిరేక పరిణామాలు ఉన్నాయట. అందుకే ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేనట్టు తెలుస్తోంది. అలా.. ఆ ఇద్దరు మహిళలు మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నా వచ్చే ఎన్నికల్లో మాత్రం టికెట్ ను దక్కించుకోలేకపోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి అందులో నిజం ఎంత అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement