YS Sharmila : ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఇప్పుడు వైఎస్ షర్మిలను టీఆర్ఎస్ ఎందుకు టార్గెట్ చేసినట్టు?

Advertisement

YS Sharmila : వైఎస్సార్టీపీ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను తెలంగాణలో పెద్దగా ఇన్నిరోజులు ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ.. తనను అలాగే వదిలేస్తే ఎక్కడ మేకై కూర్చుంటుందో అని అనుకున్నారో ఏమో కానీ.. వైఎస్ షర్మిలను టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే.. షర్మిల పార్టీ పెట్టినప్పటి నుంచి నిన్నమొన్నటి వరకు ఏనాడూ తనను ఎవ్వరూ పట్టించుకోలేదు. అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఆమెను లైట్ తీసుకున్నాయి. తను ఇప్పుడు వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేసినంతమాత్రాన, వైఎస్సార్ పేరు ఉపయోగించుకొని ప్రజల్లోకి వెళ్లినంత మాత్రాన తనకు ఒరిగేదేం లేదని అంతా అనుకున్నారు. అందుకే లైట్ తీసుకున్నారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇన్నిరోజులు సైలెంట్ గా ఉన్న అధికార పార్టీ నేతలు.. ఇప్పుడు అలర్ట్ అయ్యారు. షర్మిలపై ఏకంగా శాషనసభకే ఫిర్యాదు చేశారంటే.. పరిస్థితి ఎంత దూరం వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

తెలంగాణలో పర్యటిస్తున్న వైఎస్ షర్మిల చేస్తున్న ఆరోపణలపై వాళ్లు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి షర్మిలపై ఫిర్యాదు చేశారు. దానిపై వెంటనే స్పందించిన షర్మిల కూడా తనపై ఎమ్మెల్యేలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. నిజానికి.. ఎమ్మెల్యేలనే కాదు.. ఏకంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నే షర్మిల విమర్శించిన పరిస్థితిని మనం చూశాం. వాళ్లను విమర్శించినా పట్టించుకోని టీఆర్ఎస్ పార్టీ.. ఎమ్మెల్యేను విమర్శించారని స్పీకర్ దగ్గరికి వెళ్లడం ఏంటి అని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
trs-party-targets-ys-sharmila-in-telangana
trs-party-targets-ys-sharmila-in-telangana

YS Sharmila : ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార పార్టీ అలర్ట్ అయిందా?

ఇన్ని రోజులు ఒక లెక్క. నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని షర్మిల దీక్ష చేసినా.. పాదయాత్ర చేసినా, కేసీఆర్, కేటీఆర్ పై విమర్శలు చేసినా పార్టీ అధిష్ఠానం లైట్ తీసుకుంది. దాదాపు ఎనిమిది నెలల నుంచి షర్మిల తెలంగాణ వ్యాప్తంగా.. ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. అయినా అధిష్ఠానం పట్టించుకోలేదు. కానీ.. త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అధికార పార్టీ నేతలు ఇక లైట్ తీసుకుంటే కష్టం అని భావించి తన విమర్శలను తిప్పి కొట్టడం స్టార్ట్ చేశారు. మరోవైపు షర్మిల పార్టీ కూడా తెలంగాణలో పుంజుకోవడం, తను సభ పెడితే జనాలు కూడా వస్తుండటంతో ఇక చేసేది లేక అధికార పార్టీ అలర్ట్ అయింది. అందుకే.. ఆమెను కట్టడి చేయడం కోసం షర్మిలపై టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. చూద్దాం మరి మున్ముందు టీఆర్ఎస్, వైఎస్సార్టీపీ పార్టీ మధ్య ఇంకెన్ని విభేదాలు రానున్నాయో?

Advertisement