YS Jagan : ఏపీలో ఇంకో 18 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కోసం సంసిద్ధం అవుతున్నాయి. 2024 లో ఎన్నికల హడావుడే ఉంటుంది. ప్రతి పార్టీకి 2024 ఎన్నికలు చాలా ముఖ్యమైనది. వైసీపీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీకి కూడా. అయితే.. ప్రతిపక్షాలు మాత్రం ఎలాగైనా ఈసారి వైసీపీని ఓడించాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకోసం పొత్తు పెట్టుకోవడానికి కూడా వెనకాడటం లేదు. ఎందుకంటే.. వైసీపీ ఓడిపోతే.. ప్రతిపక్ష పార్టీలలో ఏదో ఒక పార్టీ గెలుస్తుంది. లేదంటే.. పొత్తు పెట్టుకుంటే ఒక కూటమిగా వైసీపీని ఓడగొట్టి వాళ్లు ఏపీని పాలించాలనేది ప్లాన్. అయితే.. ఈసారి కూడా టీడీపీ ఓడిపోయిందంటే ఇక టీడీపీ తన ఉనికిని కోల్పోయినట్టే.
అందుకే.. 2024 లో గెలుపు తమ పార్టీదే అని చంద్రబాబు చెబుతున్నారు. అంతే కాదు.. టీడీపీ నేతలను కూడా యాక్టివ్ చేసి ప్రజలతో మమేకం చేస్తున్నారు. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే చంద్రబాబు.. సిట్టింగ్స్ అందరికీ టికెట్స్ కన్ఫమ్ చేశారు. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ టికెట్లు కన్ఫమ్ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి జనసేన మద్దతు ఇవ్వడంతో టీడీపీ పార్టీ అద్భుతమైన విజయం సాధించింది. నిజానికి.. 2014 లో టీడీపీ అధికారంలోకి రావడానికి ఒకరకంగా పవన్ కళ్యాణ్ కారణం అయ్యారు.

YS Jagan : 2024 లో జనసేనతో టీడీపీ పొత్తు?
అయితే.. అప్పుడే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడంతో ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో టీడీపీకి తన మద్దతు ప్రకటించి.. టీడీపీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు పవన్. కానీ.. ఆ తర్వాత పవన్ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేయడం ప్రారంభించింది. కానీ.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది. జనసేన ఒంటరిగా పోటీ చేసింది. దాని ప్రభావం వల్ల.. వైసీపీ గెలిచింది. దీంతో తాను చేసిన తప్పేంటో చంద్రబాబు తెలుసుకున్నారు. అందుకే.. 2024 ఎన్నికల్లో మళ్లీ ఆ తప్పు చేయకూడదని చంద్రబాబు అనుకుంటున్నారు. అందుకే ఈసారి టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి వైసీపీని ఓడగొడుతాయా? అంత దమ్ముందా? అనేది తెలియదు. వైసీపీ నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏంటంటే.. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైఎస్ జగన్ ను ఓడించలేరు అన్న నమ్మకంతో ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?