AP : ఇప్పుడు ఇదే ఏపీ లో హాట్ బర్నింగ్ టాపిక్ !

Advertisement

AP : ఏపీలో ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అది మూడు అనే నెంబర్. అవును.. 3 అనే నెంబరే. ఆశ్చర్యపోతున్నారా? అసలు మూడు అనే అంకెతో ఏపీకి ఏంటి సంబంధం అంటారా? అక్కడికే వస్తున్నాం.. ఎందుకంటే.. వైసీపీ పార్టీకి ఉన్న అక్షరాలు మూడు. వైసీపీ ప్రభుత్వం చెబుతున్నది మూడు రాజధానులు. మరోవైపు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు.. ఇలా.. మూడు అంకెను భలేగా ట్రెండింగ్ చేస్తున్నారు ఏపీలో.

Advertisement

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఒకరకంగా వైసీపీ నేతలు ర్యాగింగ్ చేస్తున్నారు. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు లేదంటే ప్యాకేజ్ స్టార్.. ఇవి తప్పించి రాజకీయంగా పవన్ కళ్యాణ్ ను దెబ్బతీయకుండా.. పర్సనల్ విషయాల మీద వైసీపీ నేతలు అటాక్ చేస్తున్నారు. అలాగే.. మూడు రాజధానులపై కూడా వైసీపీ చాలా సీరియస్ గానే ఉంది. ఎన్నికలు అయిపోయే లోపు ఎలాగైనా మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అలా అయితేనే వచ్చే ఎన్నికల్లో తమను ఏపీ ప్రజలు మళ్లీ గెలిపిస్తారని భావిస్తోంది. అందుకే.. మూడు రాజధానుల విషయంపై ఏపీ ప్రభుత్వం ఏమాత్రం తగ్గడం లేదు.

Advertisement
what is the burning topic in ap
what is the burning topic in ap

AP : పవన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు

వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. తనను పర్సనల్ గా అటాక్ చేయడం కాదు.. మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడతా అంటూ పబ్లిక్ గా హెచ్చరించారు పవన్ కళ్యాణ్. అయితే.. ఇదంతా వైసీపీ వేసిన ప్లాన్ అని.. ఆ ప్లాన్ లో పవన్ పడిపోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కావాలనే పవన్ ను ట్రాప్ లో పడేశారని.. దాని కోసమే మూడు పెళ్లిళ్ల విషయాన్ని ఉపయోగించుకున్నారని అంటున్నారు. అందుకే.. ఏకంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఈ మూడు పెళ్లిళ్ల గురించి ఓ మీటింగ్ లో మాట్లాడారు. తాము అభివృద్ధి కోసం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నాం. కానీ.. కొందరు మాత్రం మూడు పెళ్లిళ్లు చేసుకోవాలంటూ సలహాలు ఇస్తున్నారు అంటూ సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ఆయన మాటలు విని మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం కుదురుతుందా? అలా అయితే ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏంటి అంటూ ఇన్ డైరెక్ట్ గా జగన్ విమర్శించారు. దీంతో మూడు అంకె ప్రస్తుతం ఏపీలో బర్నింగ్ టాపిక్ అయిపోయింది.

Advertisement