Pawan Kalyan : పవన్ కళ్యాణ్.. సినిమా హీరోనా.. లేక రాజకీయ నాయకుడా.. కాదు రెండు అంటారా? రెండు పడవల మీద ప్రయాణం చేయడం కరెక్టేనా. అసలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలను సీరియస్ గా తీసుకున్నారా? ఇకనైనా తీసుకుంటారా? అనేది మాత్రం తెలియడం లేదు. ఓవైపు ప్రత్యర్థ పార్టీలు విమర్శించడం చూస్తున్నాం.. మరోవైపు ఆయన చేసే చేష్టలు కూడా చూస్తున్నాం. ఏదో ఆయనకు టైమ్ దొరికినప్పుడు కొన్ని రోజులు ప్రజల్లోకి వెళ్లడం, అధికార పార్టీని విమర్శించడం ఆ తర్వాత మళ్లీ రాజకీయాలను మరిచిపోవడం ఏంటి అంటూ రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆయన రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయారు.
అయినా కూడా పవన్ కళ్యాణ్ ఇంకా ఎందుకు రాజకీయాలను సీరియస్ గా తీసుకోవడం లేదు అని అంటున్నారు.ఎందుకంటే.. ఏపీలో ఎన్నికలకు ఇంకా 18 నెలలు కూడా లేవు. అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే ఎన్నికలకు అన్ని విధాలుగా రెడీ అయింది. టీడీపీ కూడా సిట్టింగ్స్ అందరికీ టికెట్లు కన్ఫమ్ చేసింది. కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా ఎన్నికలకు రెడీ అయినట్టుగా కనిపించడం లేదు.సినిమాలు అనేది ఆయన పర్సనల్ కావచ్చు. ఆయన వృత్తి కాబట్టి ఓకే కానీ.. ఆయనకు సినిమాల నుంచి విరామం దొరికినప్పుడు వచ్చి ఒక్కసారి కనబడి నాలుగు డైలాగులు కొట్టినంత మాత్రాన ఓట్లు వచ్చి పడుతాయా? ఇది అలాంటి కాలం కూడా కాదు కదా అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు.

Pawan Kalyan : ఏదో ఒకసారి వచ్చి నాలుగు డైలాగులు కొడితే ఓట్లు వచ్చి పడతాయా?
2019 ఎన్నికల్లో జనసేన పార్టీని ప్రజలు ఎంతలా ఆదరించారో అందరికీ తెలుసు కదా. పవన్ కళ్యాణ్ ఆశయం మంచిదే కావచ్చు. కానీ.. ప్రజల సమస్యల గురించి ప్రశ్నించాలన్నా.. ప్రజా సమస్యలను తీర్చాలన్నా ప్రశ్నిస్తే సరిపోదు.. మాట్లాడితే సరిపోదు.. దానికోసం అధికారంలోకి రావాలి. అధికారంలోకి రాకుండా పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ఏం మార్చలేరు అనే విషయాన్ని తెలుసుకొని ఆయన ఇప్పటికైనా రాజకీయాల్లో యాక్టివ్ అయితే వచ్చే ఎన్నికల్లో ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది.