Pawan Kalyan : ఆ లాజిక్ మిస్ ఐన పవన్ కల్యాణ్ – వైజాగ్ లో జగన్ మార్క్ దెబ్బ !

Advertisement

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిపై రెండు నాల్కల ధోరణిని వ్యవహరిస్తున్నారా అంటే ఆయన మాటలను బట్టి అవుననే చెప్పాలి. ఎందుకంటే.. ఒకప్పుడు అమరావతి రాజధానిని తప్పుపడుతూ చాలాసార్లు ఆయన మాట్లాడారు. రాయలసీమకు ఒకసారి వెళ్లినప్పుడు కర్నూలులో ఏదో కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన వరకు రాజధాని కర్నూలే అని అన్నారు. చంద్రబాబు రాజధానిని ప్రకటించినా.. కర్నూలే అసలు రాజధాని అంటూ చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మాత్రం మాటలు మార్చి మాట్లాడుతున్నారా అనిపిస్తోంది. ఎందుకంటే.. వైజాగ్ లో మాట్లాడిన పవన్ కళ్యాణ్..

Advertisement

అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలన్నారు. రాజధానిపై తమ స్టాండ్ చాలా క్లారిటీగా ఉందని చెప్పినప్పటికీ.. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని చెప్పడంపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.అదంతా పక్కన పెడితే.. ఓ కార్యక్రమంలో వైజాగ్ నే రాజధానిగా చేయాలని కోరుతున్నానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. తన స్టాండ్ మొత్తం మారిపోయింది. కర్నూలు, వైజాగ్ అంటూ ఏ చోటికి వెళ్తే దాన్ని రాజధానిని చేయాలని ప్రశ్నించిన పవన్.. ఇక ఆ ఊసే ఎత్తలేదు. ఇంతలోనే వైఎస్ జగన్ మూడు రాజధానులను ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

Advertisement
why pawan kalyan is not understanding the problem of amaravathi
why pawan kalyan is not understanding the problem of amaravathi

Pawan Kalyan : చంద్రబాబు చేసిన తప్పునే జగన్ హయాంలో కూడా జరగాలని అనుకుంటున్నారా?

2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడంతో అమరావతి రాజధాని అంశం ఎటూ కాకుండా పోయింది. కర్నూలు, వైజాగ్ లను రాజధానులను చేయాలని పవన్ ఇదివరకు ప్రతిపాదించినదే కదా. మరి.. పవన్ ప్రతిపాదన ప్రకారం.. వైఎస్ జగన్ కూడా వాటినే రాజధానులుగా ప్రకటించారు కదా. మరి.. తను ప్రతిపాదించిన వాటినే ప్రకటించినా ఎందుకు పవన్ తట్టుకోలేకపోతున్నారు. 2014 లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు ఏం చేశారు.. ఇదివరకు హైదరాబాద్ విషయంలో చేసిన తప్పునే మళ్లీ రిపీట్ చేశారు. కానీ.. 2019 లో టీడీపీ ఓడిపోవడంతో జగన్ అధికారంలోకి వచ్చి అమరావతిని పక్కన పెట్టారు. సరే.. చంద్రబాబు విషయాన్ని పక్కన పెడితే అసలు పవన్ ఎందుకు గత చరిత్రను తెలుసుకొని మాట్లాడలేకపోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement