YS Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అందుకే ఇంకా ఏ పార్టీ కూడా పొత్తుల జోలికి పోవడం లేదు. ఇంకా పొత్తుల గురించి తేల్చడం లేదు. అయితే.. అధికార పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ ను ఇబ్బంది పెడుతున్నారని.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన్ను కలవడానికి వెళ్లారు. పరామర్శించడానికి వెళ్లారు. దాన్ని భూతద్దంలో చూసిన వైసీపీ నేతలు.. తెగ టెన్షన్ పడుతున్నారు. పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు కలిస్తే వీళ్లకు వచ్చిన నష్టం ఏంటో తెలియదు కానీ.. వైసీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జనసేన ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉంది.
అసలు ఇప్పటికీ ఆ పొత్తు ఉందా లేదా అనేది మాత్రం తెలియదు.ఇక.. బీజేపీని వదిలేసి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ.. టీడీపీతో పొత్తు పెట్టుకుందా? అందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి తిరుగుతున్నారా అని వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. అసలు పవన్ కు దమ్ములేదు… అందుకే పొత్తు పెట్టుకుంటున్నారు.. అంటూ కొందరు అంటున్నారు. అసలు.. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలపడానికి పవన్ కళ్యాణ్ దగ్గర అభ్యర్థులు ఉన్నారా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

YS Jagan : వైసీపీ గెలుపునకు అడ్డంగా ఉన్నది జనసేనేనా?
నిజానికి వైసీపీ గెలుపుకు అడ్డంగా ఉన్న జనసేన పార్టీనే. అందుకే.. వైసీపీ నేతలకు ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ వచ్చిన ఓట్ల శాతం ఈసారి తగ్గే అవకాశం ఉందని.. దానికి కారణం.. జనసేన అని పలు సర్వే సంస్థలు కూడా చెప్పాయి. ఈనేపథ్యంలో వైసీపీ నేతలు ఎక్కువగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు. 2014 లో టీడీపీకి చాన్స్ ఇచ్చారు.. 2019 లో వైసీపీకి చాన్స్ ఇచ్చారు. 2024 లో పవన్ కు ఒక చాన్స్ ఇద్దాం అనే ఆలోచనలో ఏపీ ప్రజలు ఉన్నట్టు తెలియడంతో వైసీపీ నేతల్లో గుబులు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు కూడా అందుకే పవన్ కు దగ్గరవుతున్నారని, ఒకవేళ వీళ్లిద్దరూ కలిస్తే వైసీపీకి తీరని నష్టం జరుగుతుందని వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. చూద్దాం మరి భవిష్యత్తులో ఇంకేం జరుగుతుందో.