YS Jagan : ప్రస్తుతం ఏపీలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈయన హత్య కేసు ఇంకా ఎటూ తేలడం లేదు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న డ్రైవర్ దస్తగిరి కూడా అప్రూవర్ గా మారాడు. ప్రస్తుతం దస్తగిరి దగ్గర ఉన్న గన్ మెన్లను ప్రభుత్వం మార్చేసింది. దీంతో డ్రైవర్ దస్తగిరి షాక్ అయ్యాడు. వెంటనే ఎస్పీ జిల్లా కార్యాలయానికి వెళ్లి తనకు రక్షణ కల్పించాలని దస్తగిరి కోరాడు.తనకు ఉన్న గన్ మెన్లకు ఎందుకు మార్చారని, తనకు ఏదైనా జరిగితే దానికి సీఎం జగనే బాధ్యత వహించాలని ఫిర్యాదు చేశాడు.
తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే గన్ మెన్లను మార్చారని, ఎస్పీ కూడా పట్టించుకోవడం లేదని, చాలా సార్లు ఫిర్యాదు చేశానని దస్తగిరి వాపోతున్నాడు. అందుకే సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ ఆదేశాలతో మరోసారి ఫిర్యాదు చేస్తున్నా అని దస్తగిరి తెలిపాడు.అయితే.. తొండూరు మండలానికి చెందిన వైసీపీ నేతలు తనపై అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారని, తనను వేధిస్తున్నారని అన్నాడు. అయితే.. సహ నిందితులకు అప్పీల్ చేసే అధికారం లేదని సుప్రీం ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన దస్తగిరి తనకు రక్షణ కావాలంటూ ఫిర్యాదు చేశారు.

YS Jagan : వైసీపీ నేతలు నాపై అక్రమంగా కేసులు పెట్టించి వేధిస్తున్నారు
తనకు క్షమాభిక్ష పెట్టాలని అప్రూవర్ గా దస్తగిరి మారడంతో వెంటనే ఆయన క్షమాభిక్షను సవాల్ చేస్తూ పలువురు సుప్రీంలో సవాల్ చేసిన విషయం తెలిసిందే. వారి పిటిషన్లను సుప్రీం తాజాగా డిస్మిస్ చేసింది. చాలా రోజుల తర్వాత వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ అధికారులు తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుపై సీబీఐ చార్జిషీట్లను దాఖలు చేసింది. కోర్టుకు కూడా సబ్మిట్ చేసింది. అలాగే.. సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ కు కూడా కొందరు వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆయన కడప సెంట్రల్ జైలు నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఆయన వాహనాన్ని ఆపి మరీ బెదిరింపులకు గురి చేయడంతో.. ఆయన వాహన డ్రైవర్ వెంటనే కడప పోలీస్ స్టేషన్ లో ఈ విషయంపై ఫిర్యాదు కూడా చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.