God Father Movie Review : మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దసరా సందర్భంగా అక్టోబర్ 5, 2022న రిలీజ్ అయింది. యూఎస్ లో ఈ సినిమా ప్రీమియర్స్ కూడా అప్పుడే ప్రదర్శితం అయ్యాయి. అయితే.. సెన్సార్ బోర్డ్ రివ్యూ అంటూ ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు మెగాస్టార్ మూవీపై ముందే రివ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా చిరంజీవికి తగ్గ సినిమా కాదంటూ రెచ్చగొట్టేలా రివ్యూ ఇచ్చాడు. గాడ్ ఫాదర్ ఫస్ట్ రివ్యూ అంటూ ట్విట్టర్ లో ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. సెన్సార్ బోర్డ్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ప్రకారం..బీ, సీ క్లాస్ మాస్ వాళ్లకే ఈ సినిమా నచ్చుతుందన్నాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ అయ్యారు. నిజానికి.. ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూకు, ప్రస్తుతం సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల నుంచి వస్తున్న టాక్ కు సంబంధమే లేదు.

సినిమా పేరు : గాడ్ ఫాదర్
నటీనటులు : చిరంజీవి, నయనతార, సత్యదేవ్, తదితరులు
డైరెక్టర్ : మోహన్ రాజా
రిలీజ్ డేట్ : అక్టోబర్ 5, 2022
God Father Movie Review : సినిమా కథ ఇదే
పీకేఆర్ ఒక గాడ్ ఫాదర్. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన మరణంతో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆయన చనిపోయాక.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? ఎవరు అవ్వాలి? అసలు ఆయన వారసులు ఎవరు? అనేదానిపై చర్చ నడుస్తుంది. ఇక.. ఆయన పార్టీకి చెందిన నేతలు అయితే నేనే ముఖ్యమంత్రి అంటూ వ్యూహాలు పన్నుతారు. కానీ.. తన రాజకీయ వారసులు బ్రహ్మ(చిరంజీవి), సత్యప్రియ(నయనతార) అని చనిపోక ముందు పీకేఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. సత్యప్రియ.. పీకేఆర్ కూతురు. బ్రహ్మ.. సత్యప్రియకు వరుసకు అన్నయ్య అవుతాడు. కానీ.. ఆయన వారసుడు అంటే సత్యప్రియ ఒప్పుకోదు. మరోవైపు సత్యప్రియ భర్త జైదేవ్(సత్యదేవ్) ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలని అనుకుంటాడు. అతడు చాలా శక్తిమంతుడు. ఎన్నో చీకటి వ్యాపారాలను నిర్వహిస్తూ ఉంటాడు. సత్యదేవ్ కుట్రలు తెలుసుకొని బ్రహ్మ ఎంటర్ అవుతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? సత్యప్రియ.. బ్రహ్మను నమ్ముతుందా? చివరకు సీఎం ఎవరు అవుతారు.. అనేది తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.
విశ్లేషణ
గాడ్ ఫాదర్ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో వచ్చింది. ఈసినిమాపై మెగా ఫ్యాన్స్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు. దానికి కారణం.. ఇప్పటి వరకు వచ్చిన సైరా, ఆచార్య రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో మెగా ఫ్యాన్స్ అందరూ గాడ్ ఫాదర్ మీదనే ఆశలు పెట్టుకున్నారు. అందులోనూ మలయాళంలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మలయాళంలో ఈ సినిమాను లూసిఫర్ పేరుతో తెరకెక్కించారు. అక్కడ మోహన్ లాల్ హీరోగా నటించారు. తెలుగులో లూసిఫర్ సినిమానే మోహన్ రాజా.. గాడ్ ఫాదర్ గా తెరకెక్కించారు.
మెగాస్టార్ చిరంజీవి.. బ్రహ్మ పాత్రలో ఒదిగిపోయాడు. సూపర్బ్ గా యాక్ట్ చేశాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా తన పాత్రలో అద్భుతంగా నటించాడు. సల్మాన్ ఖాన్, చిరంజీవి ఇద్దరి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు అదరహో అనిపిస్తాయి. నిజానికి ఇది రీమేక్ సినిమా అయినప్పటికీ ఈ సినిమాను తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేలా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకొని కథలో మార్పులు చేశారు. ఇక.. ఈ సినిమాలో మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతం.
ప్లస్ పాయింట్స్
మెగాస్టార్ నటన
సత్యదేవ్ విలనిజం
స్క్రీన్ ప్లే
స్టోరీ
డైరెక్షన్
మైనస్ పాయింట్స్
సాగదీత
ఎడిటింగ్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
కన్ క్లూజన్
చివరగా చెప్పొచ్చేది ఏంటంటే.. ఒక పవర్ ప్యాక్డ్ మూవీని వీక్షించాలనుకుంటే దసరా సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమాకు నిరభ్యంతరంగా వెళ్లొచ్చు.
దిఇండియాటుడేన్యూస్ రేటింగ్ : 3.25/5