Sardar Telugu Movie Review : కార్తీ తెలుసు కదా. తమిళం హీరో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు కూడా ఆయన్ను ఓన్ చేసుకున్నారు. అందుకే ఆయన ఏ సినిమా నటించినా ఆ సినిమా ఖచ్చితంగా తెలుగులో కూడా రిలీజ్ కావాల్సిందే. తాజాగా కార్తీ నటించిన సర్దార్ మూవీ రిలీజ్ అయింది. ఇటీవలే కార్తీ.. పొన్నియన్ సెల్వన్ వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది ఫేమస్ డైరెక్టర్ పీఎస్ మిత్రన. ఈయన ఇప్పటికే అభిమన్యుడు అనే సినిమాను తీశాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా టీజర్, ట్రైలర్, ప్రచార చిత్రాలు సినిమా అంచనాలను ఒక్కసారిగా పెంచాయి. మరి.. సర్దార్ తెలుగు ప్రేక్షకులను అలరించాడా? లేదా? అనేది తెలియాలంటే సినిమా కథ ఏంటో తెలుసుకోవాల్సిందే.
కార్తీ పేరు విజయ్ ప్రకాష్. పోలీసు ఆఫీసర్. ఎప్పుడూ వార్తల్లో ఉండాలి అని అనుకునే వ్యక్తి. ఎప్పుడూ మీడియాలో కనిపించాలనే వ్యక్తి. దాని కోసం ఏదైనా చేస్తాడు. సెన్సేషన్ కావడానికి.. వార్తల్లో నిలవడానికి ఎంత దూరం అయినా వెళ్తాడు. అదే ఆయన నైజం. ఎప్పుడైతే ఆంధ్రా యూనివర్సిటీలో ఒక ముఖ్యమైన ఫైల్ కనిపించకుండా పోతుందో అప్పుడే అసలు కథ మొదలవుతుంది. దాని వెనుక సీబీఐ, రా పడుతున్నాయని.. సైనిక రహస్యాలు ఆ ఫైల్ లో ఉన్నాయని తెలిసి సీబీఐ వాళ్ల కంటే ముందే ఆ ఫైల్ ను కనుక్కొని మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వాలనుకుంటాడు. ఫైల్ ను వెతుకుతున్న క్రమంలో విజయ్ ప్రకాశ్ కు తన తండ్రి గురించి తెలుస్తుంది. అసలు తన తండ్రి ఎవరు? తన తండ్రి మిషన్ ఏంటి? ఆ మిషన్ లో విజయ్ ప్రకాష్ భాగం అవుతాడా? ఆ తర్వాత ఏం జరిగింది అనేదే మిగితా కథ.

Sardar Telugu Movie Review : కథ
సినిమా పేరు : సర్దార్
నటీనటులు : కార్తీ, రాశి ఖన్నా, చుంకీ పాండే, సిమ్రాన్, రజిషా విజయన్, మునిష్కాంత్, మురళీ శర్మ
ప్రొడ్యూసర్ : లక్ష్మణ్ కుమార్
మ్యూజిక్ డైరెక్టర్ : జీవీ ప్రకాశ్ కుమార్
సినిమాటోగ్రఫీ : జార్జ్ సీ విలియమ్స్
విడుదల తేదీ : 21 అక్టోబర్ 2022
సినిమా ఎలా ఉంది?
తమిళ ఇండస్ట్రీలో పీఎస్ మిత్రన్ మంచి పేరున్న డైరెక్టర్. తన తొలి మూవీ అభిమన్యుడుతోనే ఆయన తన సత్తా ఏంటో చాటాడు. ఆ సినిమా తర్వాత మిత్రన్ నుంచి వస్తున్న మూవీ సర్దార్. ఈ సినిమా ఒక గూఢచారి కథ. ఇక.. ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సింది స్క్రీన్ ప్లే. ఆ తర్వాత క్లయిమాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో కార్తీ.. తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. రెండు పాత్రలను కార్తీ అద్భుతంగా నటించాడు. తన నటన అదుర్స్. ఇక.. హీరోయిన్ రాశీ ఖన్నా లాయర్ పాత్రలో నటించింది. అలాగే.. మిగితా నటులు కూడా తమ సినిమాలతో అలరించారు. ఒక గూఢచారి దేశం కోసం తన జీవితాన్ని ఎలా త్యాగం చేశాడు అనేది ఈ సినిమాలో చూడొచ్చు. అతడి ధైర్య సాహసాలను ఈ సినిమాలో చక్కగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంటుంది.
ప్లస్ పాయింట్స్
సినిమా కథ
కార్తీ నటన
స్క్రీన్ ప్లే
బీజీఎం
మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్
కన్ క్లూజన్
చివరగా చెప్పొచ్చేదేంటంటే.. దేశం కోసం ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. కొందరి ప్రాణ త్యాగాల గురించి దేశానికి తెలియదు. అలాంటి వాళ్ల గురించి చెప్పిన ప్రయత్నమే ఈ సినిమా.
దిఇండియాటుడేన్యూస్ రేటింగ్ : 3/5