Manchu Vishnu Ginna Movie Review : మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రస్తుతం మా ప్రెసిడెంట్. అది పక్కన పెడితే ఆయన నటించిన సినిమాల కంటే కూడా ఆయన మాట్లాడే తీరు, ఆయన ప్రవర్తనతో ట్రోల్స్ రావడం వల్ల వచ్చిన పేరే ఎక్కువ. అందుకే సోషల్ మీడియాలో ఎక్కువగా మంచు విష్ణు లేదంటే మంచు ఫ్యామిలీ ట్రోల్సే కనిపిస్తుంటాయి. ఎన్ని ట్రోల్స్ వచ్చినా.. తనను ఎంత అవమానించినా.. చిన్నచూపు చూసినా మంచు విష్ణు మాత్రం తాను ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. చేసి చూపిస్తాడు. తన లాస్ట్ మూవీ మోసగాళ్లు డిజాస్టర్ అయినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మళ్లీ జిన్నా పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మంచు విష్ణు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, పోస్టర్లు సినిమా మీద అంచనాలు పెంచాయి. చివరకు ఈ సినిమా దీపావళి కానుకగా ఇవాళ విడుదలైంది. మరి ఈసారైనా మంచు విష్ణు ప్రేక్షకులను అలరించాడా? సినిమా ఎలా ఉంది.. అనేది తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
కథ : సినిమా కథ ఏంటంటే.. ఈ సినిమాలో మన హీరో పేరు జిన్నా. అతడిది తిరుపతి. తన ఫ్రెండ్స్ తో కలిసి టెంట్ హౌస్ నడుపుతుంటాడు జిన్నా. ఓ గుండా దగ్గర జిన్నా అప్పు చేస్తాడు. దాన్ని తిరిగి తీర్చలేకపోతాడు. దీంతో పరారీలో ఉంటాడు. ఆ గుండాకు దొరకకుండా తప్పించుకు తిరుగుతుంటాడు. చివరకు ఆ గుండా జిన్నాను ఎలాగోలా పట్టుకోగలుగుతాడు కానీ.. అప్పు తీర్చడానికి ఒక షరతు పెడతాడు జిన్నాకు. తన అప్పు తీర్చకున్నా పర్వాలేదు కానీ.. తన సోదరిని పెళ్లి చేసుకోవాలని ఆ గుండా షరతు పెడతాడు. అసలు తన సోదరి ఎవరో కాదు.. సన్నీ లియోన్. దీంతో అప్పు తీర్చలేక.. చేసేదేం లేక సన్నీ లియోన్ ను పెళ్లి చేసుకోవడానికి వాళ్ల ఇంట్లో ఉంటాడు. అక్కడ ఆయనకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అతడికి పాయల్ రాజ్ పుత్ ఎక్కడ కనిపిస్తుంది. తనతో పాయల్ కు ఉన్న బంధం ఏంటి.. చివరకు గుండా సోదరిని పెళ్లి చేసుకుంటాడా అనేది తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.

సినిమా పేరు : జిన్నా , నటీనటులు : మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్, వెన్నెల కిషోర్, నరేష్, సద్దాం, డైరెక్టర్ : సూర్య, ప్రొడ్యూసర్ : మంచు విష్ణు, మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ : చోటా కే నాయుడు, విడుదల తేదీ : 21 అక్టోబర్ 2022
Manchu Vishnu Ginna Movie Review : సినిమా ఎలా ఉంది?
నిజానికి ఇది ఒక హారర్ కామెడీ సినిమా అని చెప్పుకోవాలి. మంచు విష్ణు మొదటి సారి ఈ జానర్ లో సినిమాను చేశాడు. అయితే ఈ సినిమా పూర్తిగా ఎంటర్ టైన్మెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు. కామెడీ సన్నివేశాలు అయితే అదిరిపోతాయి. కాకపోతే సినిమా మొత్తాన్ని కేవలం కామెడీ కోసం చూడలేం కదా. సినిమాలో మంచి కథ ఉండాలి. కథనం ఉండాలి. అది ఎక్కడో మిస్ అయినట్టు ప్రేక్షకుడికి అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీని పంచగా, సెకండ్ హాఫ్ లో ఎవ్వరూ ఊహించని విధంగా హార్రర్ పై డైరెక్టర్ ఫోకస్ పెట్టాడు. అయితే.. సెకండ్ హాఫ్ లో కూడా కామెడీ సీన్లు అదరగొడతాయి. ఇక.. మంచు విష్ణు కామెడీ సీన్లలో అదరగొట్టేశాడు. పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ తమ పాత్రల మేరకు నటించారు. సన్నీ తన గ్లామర్ తో మెరిసిపోయింది. కాకపోతే సినిమాను కేవలం ఒక కామెడీ ఎలిమెంట్ లోనే ప్రేక్షకుడు చూడాల్సి వస్తుంది.
ప్లస్ పాయింట్స్, కామెడీ సీన్స్, మైనస్ పాయింట్స్, రొటీన్ స్క్రీన్ ప్లే, కథ, హార్రర్ కామెడీ
కన్ క్లూజన్ : చివరగా చెప్పొచ్చేదేంటంటే ఈ సినిమాను కేవలం వినోదాత్మకంగానే చూసి కాసేపు మంచి విష్ణు చేసే కామెడీని ఎంజాయ్ చేయొచ్చు.
దిఇండియాటుడేన్యూస్ రేటింగ్ : 2.75/5