The Ghost Movie Review : ది ఘోస్ట్.. అంటే దెయ్యం అని అర్థం. మరి ఈ సినిమాకు ఎందుకు ఈ పేరు పెట్టారో తెలియాలంటే మనకు ఈ సినిమా కథ గురించి తెలియాల్సిందే. అక్కినేని నాగార్జునను ఇప్పటికీ టాలీవుడ్ కింగ్ అని పిలుస్తుంటారు. తన కెరీర్ మొదటి నుంచే ఆయన ఎంచుకునే కథ చాలా డిఫరెంట్ జానర్ లో ఉంటుంది. నిజానికి తెలుగు ఇండస్ట్రీకి క్లాసిక్ హిట్ ఇచ్చిన శివ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. అంతే కాదు.. కొత్త కొత్త డైరెక్టర్లకు ఛాన్సులు ఇస్తూ వాళ్లు ఎదిగేలా ప్రోత్సహించడం నాగార్జున స్పెషాలిటీ. తాజాగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ది ఘోస్ట్ సినిమా తాజాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి.. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా? అనేది తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
The Ghost Movie Review : సినిమా కథ ఇదే
ఈ సినిమాలో నాగార్జున రా ఫీల్డ్ ఏజెంట్ గా నటించాడు. ఆయన పేరు విక్రమ్. రా ఫీల్డ్ ఏజెంట్ గా కొన్నాళ్లు పనిచేశాక.. ఇండియన్ ఎంబసీలో పని చేస్తుంటాడు విక్రమ్. అయితే.. తన కూతురు అదితిని చంపాలని కొందరు ప్లాన్ వేస్తున్నారని.. నా కూతురును ఎలాగైనా కాపాడాలని తన సోదరి.. విక్రమ్ కు ఫోన్ చేస్తుంది. దీంతో అదితిని రక్షించడం కోసం విక్రమ్ కొన్ని సాహసాలు చేయాల్సి వస్తుంది. అసలు అదితిని, తన సోదరిని చంపేందుకు కుట్ర పన్నుతున్న వాళ్లు ఎవరు.. అనేది తెలుసుకొని వాళ్లతో పోరాటాలు ప్రారంభిస్తాడు. అదితిని చంపాలనుకున్న వాళ్లందరినీ నిర్దాక్షిణ్యంగా విక్రమ్ చంపేస్తాడు. అసలు.. ఎందుకు అదితిని చంపాలనుకున్నారు? తన సోదరి ఏం తప్పు చేసింది? విక్రమ్ చిన్నతనంలో జరిగిన విషాద గాద ఏంటి? అనేది తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.

సినిమా పేరు : ది ఘోస్ట్
నటీనటులు : అక్కినేని నాగార్జున, అనిఖా సురేంద్రన్, గుల్ పనాగ్, సోనాల్ చౌహాన్, మనీష్ చౌదరి, రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, బిలాల్ హుస్సేన్ తదితరులు
దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
నిర్మాతలు : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, నారాయణ్ దాస్ నారంగ్, శరత్ మరార్
మ్యూజిక్ : భరత్ – సౌరభ్
సినిమాటోగ్రఫీ : ముఖేష్
విడుదల తేదీ : 5 అక్టోబర్ 2022
విశ్లేషణ : ది ఘోస్ట్ సినిమా కథ చాలా సింపుల్ గా ఉంటుంది. కాకపోతే ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. కొన్ని సీన్లలో భావోద్వేగాలు ఉంటాయి. విక్రమ్ పాత్రలో నాగార్జున అదరగొట్టేశాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో నాగార్జున రెచ్చిపోయాడు. ఇక.. నాగార్జున సోదరిగా గుల్ పనాగ్ అదరగొట్టేసింది. తన కూతురును రక్షించుకునే పాత్రలో డీసెంట్ గా నటించింది. ఇక.. సోనాల్ చౌహాన్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. అందరూ.. తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. సాంకేతికంగా ఘోస్ట్ సినిమా చాలా బాగుంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు ఛేజింగ్ లు బాగున్నాయి. ఇక.. దర్శకుడి గురించి చెప్పుకుంటే ఆయన దర్శకత్వంలో వస్తున్న రెండో సినిమానే అయినప్పటికీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వైవిధ్యమైన కథతో సినిమా తీసి తన డైరెక్షన్ సూపర్బ్ అనేలా పేరు తెచ్చుకుంటున్నాడు.
ప్లస్ పాయింట్స్
యాక్షన్ సీన్స్
ఛేజింగ్ సీన్స్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
సింపుల్ స్టోరీ లైన్
రొటీన్ ఫ్లాష్ బ్యాక్
కన్ క్లూజన్
చివరగా చెప్పొచ్చేదేంటంటే.. ది ఘోస్ట్ మూవీ ఒక మంచి యాక్షన్ త్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవర్ ప్యాక్ తో వచ్చిన ఛేజింగ్, యాక్షన్ సీన్స్ కావాలంటే ది ఘోస్ట్ సినిమాకు వెళ్లాల్సిందే.
దిఇండియాటుడేన్యూస్ రేటింగ్ : 3/5