Ponniyin Selvan 1 Movie Review : తమిళ దర్శకుడు మణిరత్నం సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మేలిమి ముత్యాల్లాంటి సినిమాలు తీసిన ఆయన ఇటీవల పెద్దగా సక్సెస్ లు సాధించలేదు. అయితే చాలా కాలం తీసుకొని భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా పొన్నియిన్ సెల్వన్ అనే హిస్టారికల్ మూవీ చేశాడు. ఈ మూవీ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాలో ముఖ్యపాత్రలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష నటించారు.
ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు.పొన్నియిన్ సెల్వన్’ సినిమాకు మెయిన్ పిల్లర్ లాంటి పాత్ర సుందర చోళుడు. ‘పొన్నియిన్ సెల్వన్’లో సుందర చోళుడి పాత్రను ప్రకాశ్‌రాజ్ పోషించగా,, వానవన్ మహాదేవిగా విద్య సుబ్రమణియన్ చేసారు. ఇక సినిమాలో మరో ముఖ్య పాత్ర ఆదిత్య కరికాలుడు. సుందర చోళుడి పెద్ద కొడుకు, చోళ సామ్రాజ్యపు యువరాజు ఆదిత్య కరికాలుడు. చియాన్ విక్రమ్ ఆదిత్య కరికాలన్ పాత్ర పోషించాడు. ఇక రాజకుమారి కుందవై చోళుల కాలం నాటి రాజకీయాలు, రాజనీతితంత్రంపై ఆమెకున్న పట్టు మరొకరికి లేదు. కుందవై పాత్రలో హీరోయిన్ త్రిష నటిస్తోంది.

Ponniyin Selvan 1 Movie Review : భారీ అంచనాలతో..
జయం రవి అరుళ్‌మోళి వర్మన్‌గా మనకు కనిపిస్తాడు. ఆదిత్య కరికాలన్‌కు అత్యంత నమ్మకస్తుడైన స్నేహితుడు వల్లవరాయన్ పాత్రలో హీరో కార్తి కనిపిస్తాడు. ఇక సినిమా కథను సరికొత్త మలుపు తిప్పే పాత్ర నందిని. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావడం.. పెరియా పళవెట్టారియార్‌కు భార్యగా ఉండటం.. తన అందం, అభినయంతో ఎలాంటి మగవాడినైనా తన వశం చేసుకోగలదు. ఈ పాత్రలో అందాల భామ ఐశ్వర్యరాయ్ బచ్చన్ నటిస్తోంది .సినిమాగా భావిస్తున్న పొన్నియన్ సెల్వన్ ఎట్టకేలకు శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదలవుతోంది.
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని కమల్‌తో తెరకెక్కించాలని భావించిన కొన్ని కారణాల వలన కుదరలేదు. అయితే తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ని విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష మరియు ఐశ్వర్య రాయ్ బచ్చన్ వంటి వారితో తెరకెక్కించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, నేపథ్య సంగీతం అందించారు. ఈ సినిమా కథ ఏంటో చూద్దాం…
కథ: పరాంతక చోళుడుకకి ముగ్గురు సంతానం కాగా, వారిలో ఆదిత్య కరికాలన్, అరుల్ మొలి వర్మన్ కుందవై అనే ముగ్గురు సంతానం ఉన్నారు. అరుల్ మొలివర్మన్‌ను బందీగా చేయాలని పలువెట్టరైయార్ శ్రీలంకకు రెండు ఓడలను పంపిస్తాడు. అరుల్‌ను తీసుకొని వస్తున్న సమయంలో సముద్రంలో తుఫానులో ఓడలు చిక్కుకుంటాయి. అప్పుడే ఒక జాలరి వారిని కాపాడుతుంది. అరుల్ గాయపడతాడు. అయితే కదంబూర్‌లోని భవనంలోకి ఆదిత్య కరికలన్‌ను రప్పించి హత్య చేస్తారు. ఈ హత్యకు కారణమేంటి..రాజ్యంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
నటీనటుల పనితీరు:
ముందుగా విక్రమ్ నటన గురించి చెప్పాలి. ఆయన ప్రతి ఫ్రేములో చాలా అద్భుతంగా కనిపించాడు. అంతే కాదు తన నటనతో సినిమాని పీక్స్‌లోకి తీసుకెళ్లాడు. ఆ పాత్రకి విక్రమ్ కరెక్ట్ పర్సన్ అనేలా మూవీ రూపొందించారు. కార్తి .. జయం రవి .. శరత్ కుమార్ .. పార్తీబన్ .. ఐశ్వర్య రాయ్ .. త్రిష . ఐశ్వర్య లక్ష్మి ప్రధానమైన పాత్రలను పోషించగా, వారా పాత్రలకు న్యాయం చేశారు. మిగతా పాత్రధారులు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు.
సాంకేతిక పనితీరు:
మణిరత్నం తాను అనుకున్న కథను ప్రేక్షకులకు అన్ని విధాలుగా అర్థం అయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించారు. ఆయన ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్న విధానం అద్భుతం. ఇక రెహమాన్ గురించి చెప్పనక్కర్లేదు. సంగీతంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో అదరగొట్టాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ కొంచెం లోపంగా కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
నటీనటులు
మణిరత్నం దర్శకత్వం,
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
తమిళ ఫ్లేవర్,
సాగదీత
ఫైనల్‌గా ఈ చిత్రం అందరు ప్రేక్షకులని అలరిస్తుందనే చెప్పాలి. తెలుగు డబ్బింగ్ కూడా పర్‌ఫెక్ట్‌గా సెట్ కావడంతో ఈ సినిమాత తెలుగు ప్రేక్షకులని కూడా అలరిస్తుంది. కాస్త తమిళ ఫ్లేవర్ ఎక్కువగా ఉండడంతో ఇబ్బందిగా ఫీలవుతున్నారు. తమిళ బాహుబలిగా ప్రచారం జరిగిన ఈ చిత్రం తప్పక అలరిస్తుందని చెప్పవచ్చు.
రేటింగ్ 2.75/5