Swathi Muthyam Movie Review : సాధారణంగా పండుగల సందర్భంగా పెద్ద పెద్ద సినిమాలు విడుదల అవుతుంటాయి. కానీ.. దసరా సందర్భంగా పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమా కూడా ఒకటి రిలీజ్ అయింది. అదే స్వాతిముత్యం. ఓవైపు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, కింగ్ నాగార్జున ది ఘోస్ట్ సినిమాలు విడుదలైన రోజే దసరా సందర్భంగా అక్టోబర్ 5న స్వాతిముత్యం సినిమా విడుదలైంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాతో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ చిన్నకొడుకు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు సినిమా మీద అంచనాలను పెంచాయి. మరి.. బెల్లంకొండ గణేష్ తొలి మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? తెలియాలంటే సినిమా స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

సినిమా పేరు : స్వాతిముత్యం
నటీనటులు : బెల్లంకొండ గణేష్, బొల్లమ్మ వర్ష, రావు రమేష్, వెన్నెల కిషోర్, వీకే నరేష్, తదితరులు
డైరెక్టర్ : లక్ష్మణ్ కే కృష్ణ
మ్యూజిక్ డైరెక్టర్ : మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫీ : సూర్య
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ
విడుదల తేదీ : అక్టోబర్ 5, 2022
Swathimuthyam Review : కథ
కాకినాడ, పిఠాపురానికి చెందిన బాలు(బెల్లంకొండ గణేష్) విద్యుత్ శాఖలో జూనియర్ ఇంజనీర్ గా పని చేస్తుంటాడు. తను చాలా అమాయకుడు. ఎవరి పని వాళ్లు చేసుకుంటూ వెళ్తారు. ఇంట్లో తనకు పెళ్లి చేయడానికి సంబంధాలు చూస్తుంటారు. చాలా పెళ్లి చూపులు జరుగుతాయి కానీ.. తనకు ఎవ్వరూ నచ్చరు. ఓ పెళ్లి చూపుల్లో భాగ్యలక్ష్మి( వర్ష బొల్లమ్మ)ను చూస్తాడు. తను నచ్చుతుంది. చేసుకుంటే తననే పెళ్లి చేసుకుంటా అంటాడు. భాగ్యలక్ష్మి ఇంజనీరింగ్ చదువుకుంటుంది. బెంగళూరులో తనకు జాబ్ వస్తుంది. కానీ.. తన ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోకపోవడంతో తను ఆ ఊళ్లోనే ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. కానీ.. పెళ్లి తర్వాత తనకు ఉద్యోగం చేయాలని కోరిక ఉంటుంది. అది బాలు ఫ్యామిలీకి ఇష్టం ఉండదు. దీంతో భాగ్యలక్ష్మి అతడితో పెళ్లికి ఒప్పుకోదు. కానీ.. తనంటే ఇష్టం ఉన్న బాలు.. ఎలాగోలా తనతో పెళ్లికి ఒప్పిస్తాడు. పెళ్లి పనులు దగ్గరికి రాగానే.. ఇంతలో బాలుకు షాక్ తగులుతుంది. ఇంతలో శైలజ అనే యువతి తనకు ఫోన్ చేస్తుంది. దీంతో తన పెళ్లి ఆగిపోతుంది. ఇంతకీ శైలజ ఎవరు? భాగ్యలక్ష్మిని చివరకు పెళ్లి చేసుకున్నాడా లేదా.. అనేది తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.
విశ్లేషణ : ఈ సినిమా స్పెర్మ్ డొనేషన్ అనే కాన్సెప్ట్ తో రూపొందింది. ఇప్పటికే స్పెర్మ్ డొనేషన్ మీద చాలా సినిమాలే వచ్చినా దాన్నే బేస్ చేసుకొని సరికొత్తగా సినిమాను రూపొందించాడు లక్ష్మణ్ కే కృష్ణ. అదే కాన్సెప్ట్ తో స్వాతిముత్యం కథను రాసుకున్నాడు. తొలి సినిమా అయినప్పటికీ బెల్లంకొండ గణేష్ చక్కగా నటించాడు. హీరోయిన్ వర్ష కూడా తన నటనతో అదరగొట్టేసింది. టెక్నికల్ గా సినిమా బాగుంది.
ప్లస్ పాయింట్స్
సినిమా స్టోరీ
డిఫరెంట్ కాన్సెప్ట్
మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్
కన్ క్లూజన్
ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. దసరా సందర్భంగా ఫ్యామిలీతో కలిసి ఏంచక్కా ఎంజాయ్ చేయొచ్చు.
దిఇండియాటుడేన్యూస్ రేటింగ్ : 3/5