David Warner : డేవిడ్ వార్నర్ .. మామూలోడు కాదు .. పుష్ప ని దింపేశాడు !

Advertisement

David Warner : ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసిన పుష్ప హ‌వా న‌డుస్తుంది. సినిమా ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు, క్రికెట‌ర్స్ కూడా పుష్ప మానియాలో మునిగి తేలారు. ఫిలిం ఫేర్‌ పురస్కారాల్లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ మూవీ సత్తా చాటింది. ఈ సినిమాకు ఏకంగా ఏడు పురస్కారాలు దక్కాయి. సినిమా విడుద‌లై ఏడాది కావొస్తున్నా కూడా హ‌వా త‌గ్గ‌లేదు. ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ పుష్ప టీమ్‌కు అభినందనలు తెలిపారు.‘‘ ఫిలింఫేర్ అవార్డులకు అల్లు అర్జున్‌ పుష్ప ఎంపికవ్వడం సంతోషం. అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో నటించిన వారందరికీ అభినందనలు” అని పోస్ట్‌ చేశారు. దీంతో పాటు ‘పుష్ప’ గెటప్‌లో ఉన్న తన ఫోటోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Advertisement

పుష్పరాజ్ గెటప్ లో డేవిడ్ వార్నర్ అద్భుతంగా ఉన్నాడు. ఆయన ఆహార్యం అచ్చం బన్నీని పోలినట్టే ఉంది. ఇక ఇంతకు ముందు కూడా పుష్ప సాంగ్స్ ను రీమిక్స్ చేశాడు వార్నర్. ఈ సినిమాతో పాటు టాలీవుడ్ ఫేమస్ హీరోల సినిమాలు రిలీజ్ అవ్వగానే వాటిని ఫ్యామిలీతో సహా రీమిక్స్ చేయడం ఆయన‌కు అలవాటు. డేవిడ్ వార్న‌ర్ ఐపీఎల్ ద్వారా బాగా ఫేమ‌స్ కాగా, ఇక ఇటీవ‌ల తెలుగు సినిమాల‌కి సంబంధించిన వీడియోలు చేస్తుండ‌డం వ‌ల‌న ఆయ‌న పాపులారిటీ మ‌రింత పెరిగింది. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో క్రికెట్ ప్లేయర్లు కూడా సినిమాలు చూసి తమ హవాని కొనసాగిస్తూ ఉండ‌డం విశేషం.

Advertisement
david warner turned to pushpa
david warner turned to pushpa

David Warner : పుష్ప మానియా..

ఇక ఫిలిం ఫేర్ అవార్డుల్లో పుష్ప ది రైజ్‌కు ఏడు అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్‌, సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌, మేల్‌ సింగర్‌, ఫీమేల్‌ సింగర్‌, సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డ్స్‌ వచ్చాయి. బెంగ‌ళూరులో జ‌రిగిన ఈవెంట్‌లో పుష్ప చిత్రానికి ఉత్తమ న‌టుడిగా అవార్డు అందుకున్నాడు బ‌న్నీ. ఈ సంద‌ర్భంగా ప్రతి ఒక్కరికీ ధ‌న్యవాదాలు తెలియ‌జేశాడు బ‌న్నీ. ఈసినిమాతో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాకు వెళ్లిన బన్నీకి..అక్కడ తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. బన్నీ ఎప్పుడు కనిపిస్తాడా అని ఎదురు చూస్తున్నారు నార్త్ ఫ్యాన్స్. ఈ మధ్య అమృత్ సర్ వెళ్తే.. సాధరంగా ఆహ్వనించారు అక్కడ టీమ్.

Advertisement