Ganguly : బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలి సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ అపాయింట్ అయ్యారు. బీసీసీఐకి ఆయన 36వ అధ్యక్షుడు. ఈ ఉదయం ముంబైలో ఏర్పాటైన ఈ సమావేశం సందర్భంగా రోజర్ బిన్నీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఆయన నియామకంతో ఇక సౌరవ్ గంగూలీ కుర్చీ దిగాల్సి వచ్చింది. అయితే గంగూలీకి ఐసీసీ చైర్మెన్ పదవి వస్తుందని భావించారు. అయితే ఆ అవకాశాలు సన్నగిల్లినట్లు స్పష్టమవడంతో నెక్స్ట్ క్యాబ్ ఎన్నికలపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
బీసీసీఐ పెద్దలు మాట్లాడుతూ, “ఐసీసీ ఖాళీలకు నామినేషన్లు వేయడానికి చివరి తేదీ గురువారం. అయితే, బీసీసీఐలో కుదిరిన ఏకాభిప్రాయం ప్రకారం ఈసారి బీసీసీఐ వైపు నుంచి ఐసీసీ పదవికి ఎవరూ నామినేట్ చేయరు.” అని ప్రకటించారు. “ఐసీసీ అత్యున్నత పదవికి ఎవరూ పరిగణించబడరని, ఈమేరకు బోర్డు దాని స్వంత అభ్యర్థిని కలిగి ఉండాలా లేదా బార్క్లీకి మద్దతివ్వాలా అనే ఎంపిక సభ్యులు తర్వాత నిర్ణయిస్తారని” తెలిపారు. ఇక ఈ ఉదయం ముంబైలో ఆరంభమైన వార్షిక సర్వ సభ్య సమావేశానికి సౌరవ్ గంగూలీ, జై షా, రోజర్ బిన్నీ, కోశాధికారి అరుణ్ సింగ్ ధుమాల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ ఛైర్మన్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా హాజరయ్యారు.

Ganguly : కీలక నిర్ణయం.
బీసీసీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఇతర సభ్యులు, వివిధ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సాయంత్రం వరకూ కొనసాగనుందీ సమావేశం. బీసీసీఐ ఏజీఎంలో మహిళల ఐపీఎల్ పైనా కీలక నిర్ణం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం మహిళా ఐపీఎల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని విశ్వసనీయ సమాచారం. వచ్చే ఏడాది మార్చిలో ఈ టోర్నీ జరగనుంది.