Sourav Ganguly – Dhoni : ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఉన్న టాపిక్ ఇదొక్కటే. బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి సౌరవ్ గంగూలీని ఎందుకు తప్పించారని. గంగూలీని తప్పించడం వెనుక పెద్ద తతంగమే నడిచిందట. ఎందుకంటే.. గంగూలీ బీసీసీఐ అధ్యక్ష బాధ్యతల నుంచి ఇప్పుడు తప్పుకోవాల్సిన అవసరమే లేదు. కానీ.. ఆయనను తప్పించడం వెనుక మహేంద్ర సింగ్ ధోనీ హస్తం ఉందట. ప్రస్తుతం ఈ వార్తే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే.. గంగూలీ తీరు వల్ల ఆయనపై పలు విమర్శలు వచ్చినట్టుగా జట్టు సభ్యులు ప్రకటించారు.
అందుకే.. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీని తొలగించి ఆయన స్థానంలో రోజర్ బిన్నీని నియమించారు. గంగూలీకి ధోనీ.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ శ్రీనివాసన్ ప్రోద్బలంతోనే చెక్ పెట్టారని వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ సమావేశంలో కూడా శ్రీనివాసన్ ఈ విషయంపై గట్టిగానే వాదించినట్టు తెలుస్తోంది. అలాగే గంగూలీ అధ్యక్ష పదవిపై పలు విమర్శలు కూడా రావడంతో ఇక గంగూలీని అధ్యక్ష పదవి నుంచి తప్పించాల్సి వచ్చిందంటున్నారు. అందుకే బీసీసీఐ ఆయన్ను ఎలాగైనా అధ్యక్ష పదవి నుంచి తప్పించాలనుకుంది. దాని కోసం ఏకంగా ధోనీ సలహాలతో శ్రీనివాసన్ ఈ పని చేసినట్టు తెలుస్తోంది. అయితే.. గంగూలీ విషయంలో ధోనీ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారో మాత్రం ఎవ్వరికీ తెలియదు.

Sourav Ganguly – Dhoni : ఈ విషయంలో ధోనీ ఎందుకు ఇన్వాల్వ్ అయినట్టు?
దానికి కారణం ఒకటి చెప్పుకోవచ్చు.. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక.. ధోనీని గంగూలీ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించారు. అప్పటి నుంచి ధోనీ, గంగూలీ మధ్య దూరం పెరిగింది. సమయం కోసం వేచి చూసి.. ఇప్పుడు ఆ దెబ్బ కొట్టాడని వార్తలు వస్తున్నాయి. టీమిండియాకు ఎన్నో కప్పులు తీసుకొచ్చి భారతదేశం గర్వించేలా చేసిన ధోనీకి చివరకు వీడ్కోలు మ్యాచ్ కూడా ఏర్పాటు చేయకపోవడంతోనే గంగూలీపై ధోనికి కోపం పెరిగిందని తెలుస్తోంది. అందుకే అవకాశం కోసం వేచి చూసి.. ఇప్పుడు గంగూలీపై శ్రీనివాసన్ తో తన పగ తీర్చుకున్నాడని చెబుతున్నారు. చూద్దాం మరి ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళ్తుందో?