Ind vs SA : ఇటీవల ఆస్ట్రేలియాపై రెండు విజయాలు సాధించిన భారత్ ఇప్పుడు సౌతాఫ్రికాపై కూడా రెండు విజయాలు సాధించి సిరీస్ గెలుచుకుంది. భారత్, సౌతాఫ్రికా మధ్య గువాహటిలో జరుగుతున్న మ్యాచ్కు పాము చిన్న అంతరాయం కలిపించంది. భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుండగా గ్రౌండ్లోకి సడన్గా పాము ఎంటర్ అయ్యింది. దీంతో మ్యాచ్ను కాసేపు నిలిపేశారు. మైదానం సిబ్బంది వచ్చి పామును పట్టుకుని తీసుకెళ్లాక మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. అయితే సడెన్గా పాము ప్రత్యక్షం కావడంతో అందరు ఉలిక్కి పడ్డారు.
పాముని గమనించకుండా ఎవరైన తొక్కి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని భావిస్తున్నారు. భారత్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో సౌతాఫ్రికా జట్టు పోరాడి ఓడింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు.. సఫారీ బౌలర్ల పేలవ ప్రదర్శన కారణంగా భారీ స్కోరు చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (61), కేఎల్ రాహుల్ (57), విరాట్ కోహ్లీ (49 నాటౌట్) రాణించారు. దీంతో భారత జట్టు 237/3 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో సఫారీ బ్యాటర్లు తడబడ్డారు. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (0), రైలీ రూసో (0) ఇద్దరూ రెండో ఓవర్లోనే డకౌట్లుగా పెవిలియన్ చేరారు.

Ind vs SA : వణికించిన పాము..
ఆ తర్వాత కాసేపు ధాటిగా ఆడిన ఎయిడెన్ మార్క్రమ్ (33)ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు.క్వింటన్ డీకాక్ (69 నాటౌట్)తో జత కట్టిన డేవిడ్ మిల్లర్ (47 బంతుల్లో 106 నాటౌట్) ఆ జట్టును గెలిపించినంత పనిచేశాడు. భారత బౌలర్లు కొంత కట్టడి చేయడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో సఫారీ జట్టు 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు మాత్రమే చేసింది. దీంతో రెండో టీ 20లో భారత జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. స్వదేశంలో సౌతాఫ్రికాపై భారత్ గెలిచిన తొలి సిరీస్ ఇదే కావడం గమనార్హం.