Kohli – Surya : భారత బ్యాట్స్‌మెన్స్ ఇటీవల ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నారు. బౌలర్స్ మాత్రం తేలిపోతున్నారు.ఎంత పెద్ద స్కోర్ చేసిన కూడా మ్యాచ్‌ని కాపాడుకోలేకపోతున్నారు. 19వ ఓవర్ సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంది. బౌలర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కీలక ప్రపంచకప్ ముందు ఈ ఓవర్‌లో భారత బౌలర్లు ధారళంగా పరుగులిస్తుండటం అటు టీమ్‌మేనేజ్‌మెంట్‌తో ఇటు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ ఇలా ఎవరూ వేసినా పరుగుల మోత మోగుతుంది. తాజాగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది.
తన తొలి ఓవర్‌లోనే 2 వికెట్లు తీసి జోరు కనబర్చిన అర్ష్‌దీప్ సింగ్.. 19వ ఓవర్‌లో ఏకంగా 26 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక బ్యాట్స్ మెన్స్ విషయానికి వస్తే.. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20తో భారత బ్యాటర్లు నిరూపించారు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన ఐదుగురు ఆటగాళ్లు కూడా రాణించారు. సూర్యకుమార్ యాదవ్, కింగ్ కోహ్లీ అద్భతమైన ఇన్నింగ్స్ ఆడడంతో వారివారి ఖాతాల్లో అరుదైన రికార్డులు నమోదయ్యాయి. భారత గడ్డపై సౌతాఫ్రికా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టీ20 సిరీస్‌ను ఓడిపోలేదు. కాని తొలిసారి సిరీస్ కోల్పోయారు. గౌహతీలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 16 పరుగుల తేడాతో విజయం సాధించడంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.

Kohli – Surya : రికార్డుల మోత…
ఆదివారం మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ 22 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సులతో 61 పరుగులు చేయగా, 24 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సూర్యకుమార్ టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి సూర్య కేవలం 573 బంతు మాత్రమే తీసుకున్నాడు. ఇది వరల్డ్ రికార్డ్ అనే చెప్పాలి. ఇక విరాట్ కోహ్లీ కూడా ఆదివారం మ్యాచ్‌లో అద్భుతంగా రాణించగా, టీ20 క్రికెట్‌లో 11 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీ20 11వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఇండియన్ క్రికెటర్ కోహ్లీ కావడం విశేషం.