KL Rahul : తిరువనంతపురం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. సఫారీలను 106పరుగులకి భారత బౌలర్స్ ఔట్ చేయగా, 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఆరంభంలోనే రోహిత్ (0) వికెట్ కోల్పోయింది. దీంతో కేఎల్ రాహుల్, కోహ్లి మెల్లగా బ్యాటింగ్ చేశారు. బౌలింగ్‌కు అనుకూలించే పిచ్ మీద.. గ్యాప్‌లు చూసి ఆడటంలో కొంత ఇబ్బంది పడ్డాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 17 పరుగులు మాత్రమే చేసింది. టీ20ల్లో పవర్ ప్లేలో భారత్‌కు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. 2016లో పాకిస్థాన్‌పై 3 వికెట్ల నష్టానికి 21 రన్స్ చేయడమే ఇప్పటి వరకూ పవర్ ప్లేలో లోయెస్ట్ స్కోరు.
గత ఏడాది ఇంగ్లాండ్‌పై తొలి ఆరు ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది. అయితే పవర్ ప్లే ముగిశాక విజృంభించాలనుకున్న కోహ్లీ మరుసటి ఓవర్ తొలి బంతికే కోహ్లి (9 బంతుల్లో 3 పరుగులు) ఔటయ్యాడు. అయితే అందరికి భిన్నంగా ఆడుతూ స్కోర్ బోర్డ్‌ని పరుగులెత్తించాడు సూర్య. సూర్య కుమార్ యాదవ్ 13 బంతుల్లో 21 పరుగులు చేయగా.. రాహుల్ 21 రన్స్ చేయడానికి 37 బాల్స్ తీసుకున్నాడు. విన్నింగ్ షాట్‌గా సిక్స్ బాదిన రాహుల్ 56 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో రాహుల్‌కు ఇది 19వ అర్ధ శతకం కాగా.. అందులో 11 హాఫ్ సెంచరీలు.. విభిన్న ప్రత్యర్థులపై నమోదు చేసినవే కావడం విశేషం. 11 జట్లపై హాఫ్ సెంచరీలు నమోదు చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

KL Rahul : పాపం దారుణమైన విమర్శలు..
ఇవన్నీ ఉన్నా కూడా స్లోగా ఆడినందుకు రాహుల్‌ని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడానికి రాహుల్ 56 బంతులు తీసుకున్న కారణంగా ఇలా విమర్శల పాలయ్యాడు.అయితే బౌలింగ్ కి పిచ్ అనుకూలంగా ఉంది, అప్పటికే రోహిత్, కోహ్లీ అవుట్ అవ్వడంతో కేఎల్ రాహుల్ వికెట్ కాపాడుకునే ప్రయత్నంలో స్లోగా ఆడాడని ఆయన ఇన్నింగ్స్‌లో నాలుగు సిక్స్ లు ఉన్న విషయం మరవొద్దు అంటూ రాహుల్ అభిమానులు చురకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను తడబడుతుంటే.. సూర్య ఎంచక్క బౌండరీలు బాదడాన్ని నమ్మలేకపోయానంటూ ఆశ్చర్యపోయాడు. అలాగే అర్షదీప్ సింగ్ గేమ్ ఇంప్రూవ్ మెంట్‌ను తెగ మెచ్చుకున్నాడు.