Ashwin : అశ్విన్ ది మాములు బ్రెయిన్ కాదు.. నేను అలా చేయ‌మంటే మ‌నోడు ఏకంగా ఇది చేసాడ‌న్న కోహ్లీ

Advertisement

Ashwin : భార‌త్ పాక్ మ్యాచ్ పూర్తి అయి రెండు రోజులు అవుతున్నా కూడా ఇంకా ఈ మ్యాచ్‌కి సంబంధించి తెగ వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. పాక్‌తో మ్యాచ్ గెల‌వ‌డానికి కార‌ణం ఒక్క విరాట్ కోహ్లీనే అని చెప్పాలి. 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచి.. చరిత్ర మర్చిపోలేని గెలుపును అందించాడు. చివరి ఓవర్‌లో విజయానికి 16 పరుగులు అవసరం అవ్వగా.. క్రీజ్‌లో కోహ్లి, హార్థిక్‌ పాండ్యా ఉండడంతో గెలుపు భారత్‌దేనని అందరూ అనుకున్నారు. కాని తొలి బాల్‌కి పాండ్యా ఔట్ కావ‌డంతో ప‌రిస్థితి పూర్తిగా మారింది. తరువాత రెండు బంతులకు మూడు పరుగులే రావడంతో 3 బంతుల్లో 13 పరుగులుగా సమీకరణ మారిపోయింది.

Advertisement

ఆ స‌మ‌యంలో నాలుగో బాల్ సిక్స్ కొట్టాడు కోహ్లీ. అది నో బాల్‌ కావడంతో భారత్‌కు కలిసి వచ్చింది. ఫ్రీ హిట్‌కు త్రీ రన్స్‌ రావడంతో 2 బంతుల్లో 2 పరుగులు చేయాలి. అయితే ఐదో బంతికి దినేష్‌ కార్తీక్‌ ఔట్ అవ్వడంతో ఒక్కసారిగా స్టేడియం అంతా సైలెంట్ అయిపోయింది. ఇక చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా.. పాక్‌దే విజయమని అనుకున్నారు. అయితే అశ్విన్ కొంత తెలివిగా ఆడాడు. బౌలర్‌ మహ్మద్ నవాజ్‌ లెగ్ సైడ్ వైపు బంతి వేయగా.. అశ్విన్ లోపలికి జరడంతో అంపైర్ వైడ్‌గా ప్ర‌కటించారు.ఇక చివరి బంతికి సింగిల్‌ తీసి.. టీమిండియా అద్భుత విజయంలో అశ్విన్ కూడా భాగం పంచుకున్నాడు.

Advertisement
kohli praise on ashwin
kohli praise on ashwin

Ashwin : అశ్విన్‌పై ప్ర‌శంస‌లు..

అయితే లెగ్‌ సైడ్‌ వేసిన బంతిని వదిలేసినందుకు అశ్విన్‌ను కోహ్లి ప్రశంసించాడు. ‘అశ్విన్‌ని కవర్‌ మీదుగా బాల్‌ కొట్టమని చెప్పాను. కానీ అశ్విన్ మైండ్‌లో ఇంకా తెలివైన ఆలోచన ఉంది. బాల్ లైన్ లోపలికి వచ్చి బంతిని వైడ్‌గా మార్చాడు.. అతనికి ధైర్యసాహసాలు మెచ్చుకోవచ్చు’ అని అన్నాడు. అతనిది మాములు దిమాక్ కాదని చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం అశ్విన్ పై విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

టీ20 క్రికెట్‌లో ఇదే తన అత్యుత్తమ ఇన్నింగ్స్ అని అన్నాడు. కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. “మీరు నాకు మద్దతు ఇచ్చారు. ఇన్ని నెలలు నాపై చాలా ప్రేమను చూపించారు. మీరు నాకు అన్ని వేళల సపోర్ట్ చేశారు. మీ ప్రేమకు నేను చాలా కృతజ్ఞుడను. ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే.

Advertisement