Kohli : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కొన్నాళ్ల నుండి ఫామ్ లేమితో సతమతం కాగా, ఇప్పుడు ఆయన మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. బ్యాట్‌తో అలరిస్తూనే ఫీల్డ్‌లోను మెరుపులు మెరిపిస్తున్నాడు. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఫీల్డింగ్ చేసి ఒక రనౌట్, క్యా్ అందుకున్నాడు. అయితే పాక్ మ్యాచ్ కోసం అందరు ప్రాక్టీస్‌లలో మునిగి తేలుతున్నారు. ఇక నెట్స్ సెషన్ ముగిశాక కోహ్లితోపాటు, ఇతర క్రికెటర్లు ఖాళీ సమయంలో సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లిని కొందరు అభిమానులు కలిసి ఫొటోలు దిగుతున్నారు. ఈ క్రమంలో ఓ అందమైన అమ్మాయితో కలిసి కోహ్లి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారతీయురాలైన ఆ అమ్మాయి చాలా అందంగా ఉండటంతో ఆమె ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆ అమ్మాయి పేరు అమీషా బసేరా అని తెలుస్తోంది. ఆమె యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్‌లో చదువుకుంటోంది. చదువుకుంటూనే మోడల్‌గా పని చేస్తున్న ఆమె.. బ్రిస్బేన్‌లో భారత క్రికెటర్లను కలిసింది. కోహ్లితో మాట్లాడిన అమీషా బసేరా.. ఈ సందర్భంగా అతడితో కలిసి ఫొటో దిగింది. ఈమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కొద్ది సేపట్లోనే అమీషా బసేరా, విరాట్ కోహ్లీల ఫోటో నెట్టింట హల్చల్ చేస్తోంది. కోహ్లీతో కలిసి దిగిన ఫొటోను అమీషా సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

Kohli : అందంతో కట్టిపడేసింది..
ట్విట్టర్లో ఆ ఫొటోతోపాటు ‘ఇవాళ నా ఆరాధ్య వ్యక్తి, నా లవ్, నా మనిషి విరాట్ కోహ్లీని కలిశాను. థాంక్యూ సోమచ్’ అంటూ కోహ్లీని ట్యాగ్ చేసింది. అదే ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన అమీషా.. మాటలకు అందనిది అంటూ కోహ్లీతో కలిసిన సందర్భాన్ని తన ఫాలోవర్లతో పంచుకుంది. ఫొటో అప్లోడ్ చేయడానికి ముందు కేవలం 1000 మంది ఫాలోవర్లు ఉన్న అమీషా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, ఆ తర్వాత అమాంతంగా పెరిగిపోయారు.అమీషా అందానికి ఫ్లాట్ ఆయిన ఓ సోషల్ మీడియా యూజర్ కామెంట్ సెక్షన్లో ‘ఫాలోవర్ స్టోక్స్’ అని కామెంట్ చేశాడు. ‘విరాట్ మీరు చాలా లక్కీ’ అని ఓ అభిమాని కోట్ చేశారు.