India vs Pakistan T20 world Cup : ఈ రోజుల్లో అన్ని క్రీడలలో క్రికెట్ కు మంచి ఆధారణ ఉంది. క్రికెట్ కు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. అన్ని మ్యాచ్లలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే వేరే లెవెల్ లో ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం ఇరుదేశాల వారే కాకుండా ప్రపంచమంతా చూస్తుంది. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య ఉన్న పోరు అలాంటిది మరి. ఇక నిన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. అందులో టీమిండియా రన్మిషన్ అయినా విరాట్ కోహ్లీ తన విశ్వరూపం చూపించి మ్యాచ్ ను గెలిపించడంతో ఈ మ్యాచ్ మాటల్లో చెప్పలేని వినోదాన్ని అందించింది. ఇది కదా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే. రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఒకరోజు ముందే దీపావళి పండుగను తీసుకొచ్చాడు. కానీ ఈ మ్యాచ్లో ఒక విషయం మాత్రం వివాదాస్పదంగా మారింది. అదే చివరి ఓవర్ 4వ బంతి.
టీమిండియా విజయానికి చివరి ఓవర్ లో 16 పరుగులు చేయాల్సి ఉండగా ,హార్దిక్ పాండ్యా భారీ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ది ఫినిషర్ దినేష్ కార్తీక్ బరిలోకి దిగాడు. దినేష్ కార్తీక్ రెండో బంతికి సింగిల్ మాత్రమే తీశాడు. దీంతో నాలుగు బంతులలో 15 పరుగులు పెద్ద లక్ష్యంగా మారింది. అయితే కోహ్లీ బరిలో ఉండడంతో భారత అభిమానుల ఆశలు చావలేదు. ఇక ఆ తర్వాత బంతి కి రెండు పరుగులు చేశారు. ఇంకా మూడు పంతులు 13 పరుగులు తీయాల్సిఉండగా నాలుగో బంతిలో కింగ్ కోహ్లీ సిక్స్ కొట్టాడు. నాలుగో బంతి నడుము పైకి వచ్చిందని నోబాల్ అని అంపైర్లను కోరాడు కింగ్ కోహ్లీ. అంపైర్లు కూడా దానిని నోబాల్ గా ప్రకటించారు.

ఇక ఇప్పుడు మూడు బంతులలో ఆరు పరుగులు మాత్రమే కావాలి. తీవ్ర వత్తిడిలో ఉన్న నవాజ్ తర్వాత బంతిని వేశాడు. తర్వాత బాలులో కోహ్లీ గ్రీన్ బౌల్డ్ అయ్యాడు. కాని అది ఫ్రీ హిట్ కావడంతో మరొ మూడు పరుగులను అందుకున్నాడు. ఇక రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సి ఉంది. ఇది ఈజీ లక్ష్యం అయింది. ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. ఐదో బంతిలో దినేష్ కార్తీక్ స్టెమ్ అవుట్ అయ్యాడు. ఒక బాల్ లో రెండు రన్స్ తీయాల్సి ఉంది. అప్పుడే క్రీజ్ లోకి అడుగు పెట్టాడు అశ్విన్. వైడ్ బాల్ కు దారి ఇచ్చి ఒక రన్ సాధించాడు. దీంతో ఇప్పుడు ఒక బాల్ కి ఒక రన్ చేయాలి. తర్వాత బళ్ళను సింపుల్గా సర్కిల్ ఫిల్టర్ పైనుంచి లాంగ్ ఆఫ్ లోకి లాపైడ్ షార్ట్ తో సింగిల్ ని తీసి గెలిపించాడు.
అసలు రచ్చ ఇప్పుడు మొదలైంది కోహ్లీ సిక్స్ కొట్టిన నాలుగో బంతిని అంపైర్లు నోబాల్ ఇవ్వడం పాక్ ప్లేయర్స్ రచ్చ చేశారు. కోహ్లీ ఆ బంతిలో గ్రీస్ బయట ఉన్నాడని దాన్ని మీరు నో బాల్ ఎలా ఇస్తారని ,బ్యాట్ మాన్ అవుట్ అయితే ప్రెసెంట్ బాల్ డెడ్ బాల్ కాదా…?అంటూ పాకిస్తాన్ ఫ్యాన్స్ గోలగోల చేస్తున్నారు.
ఐసీసీ 20.1.1, 20.1.1.1, 20.1.12 ఆర్టికల్స్ ఆధారం గా చూస్తే బంతి వికెట్ కీపర్ లేదా బౌలర్ చేతుల్లో పడితే 20.1.1.1, బౌండరీ బాదితే 201.1.2 అది డెడ్ బాల్ అవుతుంది. 20.1.1.3 నిబంధన ప్రకారం బ్యాటర్ అవుటైతే నే బంతిని డెడ్ బాల్ గా ప్రకటిస్తారు. కానీ అది ఫ్రీ హిట్ కావడంతో నవాజ్ కోహ్లిని ఔట్ చేసినప్పటికీ అది ఔట్ కాదు.. అలాగే బంతి డెడ్ బాల్ కాదు.’ అలాగే నో బాల్ తర్వాత వైడ్ బాల్ వేస్తే ఫ్రీహిట్ అలాగే ఉంటుంది. అది తర్వాతి బాల్ కు వర్తిస్తుంది. ఫెయిర్ డెలివరీ వేసేంత వరకు ఫ్రీహిట్ కౌంట్ అవుతోంది. సో.. కోహ్లీ బౌల్డ్ అయిన బాల్ డెడ్ బాల్ కాదు. కోహ్లీ సిక్స్ కొట్టింది కూడా నో బాల్ నే . ఎందుకంటే ఆ బంతి కోహ్లీ నడుము కంటే ఎక్కువ ఎత్తులో వచ్చింది. అలాగే కోహ్లీ కాలు కూడా క్విజ్ లోనే ఉంది. అయితే ,ఎంపైర్ నోబాల్ ఇచ్చిన సమయంలో ఒక బాల్ మూడు రన్స్ తీసిన సమయంలోను,పాకిస్తాన్ ఆటగాళ్లందరూ ఎంపైర్ లపై వాదనకు దిగారు . ఇక ఆటగాళ్లు చేసిన గదరగోళం చూసి వక్ర బుద్ధి చూపించారని క్రికెట్ అభిమానులు,మండిపడుతున్నారు. వాళ్లు కావాలనే ఇలా ప్రవర్తిస్తున్నారని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.