Rishabh Pant : భారత క్రికెటర్ రిషబ్ పంత్.. హీరోయిన్ ఊర్వశి రౌతెలా వ్యవహారం కొన్నాళ్లుగా తెగ చర్చనీయాంశం అయింది. ఆసియా కప్ 2022కి ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రిషబ్ పంత్ గురించి మాట్లాడిన ఊర్వశి రౌతేలా.. తన కోసం పంత్ హోటల్ లాబీలో చాలా సేపు ఎదురు చూసినట్లు వెల్లడించింది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా అలసిపోయి ఉండటంతో తాను నిద్రపోయానని.. ఆ సమయంలో రిషబ్ పంత్ నుంచి వచ్చిన కాల్స్‌ని కూడా లిప్ట్ చేయలేకపోయినట్లు ఊర్వశి రౌతేలా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తన కోసం చాలాసేపు ఎదురుచూసిన పంత్ వెళ్లిపోయాడని..
ఆ తర్వాత మళ్లీ కలుద్దామని తాను చెప్పినట్లు ఊర్వశి రౌతేలా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇంటర్వ్యూలో ఊర్వశి అతని పేరుని మాత్రం పూర్తిగా చెప్పకుండా కేవలం ‘ఆర్పీ’ అంటూ సంబోధిస్తూ వచ్చింది. అయితే.. ఆ ఇంటర్వ్యూ తర్వాత రిషబ్ పంత్ స్పందిస్తూ ‘ప్రచారం కోసం ఇలా కొంత మంది ఇతరుల పేర్లని వాడుకుంటారని’’ ఘాటుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.అక్కడ నుండి ఇద్దరి మధ్య వివాదం నడుస్తూనే ఉంది. అయితే తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్‌కు ఈ ఊహించని ఘటన ఎదురైంది. దినేశ్ కార్తీక్ కారణంగా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన పంత్.. టీమిండియా 12వ ప్లేయర్‌గా సేవలందించాడు.

Rishabh Pant : ఎందుకిలా…
బౌండరీ లైన్ వద్ద వాటర్ బాటిల్‌తో ఉన్న పంత్‌ను కొంత మంది ఆకతాయిలు ఊర్వశి ఊర్వశి అని కామెంట్ చేశారు. వారు అంత అరుస్తున్నా కూడా పంత్ పట్టించుకోనట్టే వ్యవహరించాడు. టీమిండియా భవిష్యత్తు సారథి అయ్యే అవకాశాలున్న పంత్‌ను ఓ బాలీవుడ్ బ్యూటీ చెప్పింది నమ్మి ట్రోల్ చేయడం సమంజసం కాదని హితవు పలుకుతున్నారు. ఈ విషయంపై మరి ఊర్వశి ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి. ఇక నెదర్లాండ్ మ్యాచ్‌కి పంత్‌ని జట్టులోకి తీసుకుంటారనే వార్తలు వస్తుండగా, ఆ మ్యాచ్‌లో తన సత్తా చూపించుకోవాలని పంత్ భావిస్తున్నాడు.