Suryakumar Yadav : వరల్డ్ రికార్డు ను బద్దలుకొట్టిన భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్….!

Advertisement

Suryakumar Yadav : ఈ బుధవారం తిరువునంతపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో సౌతాఫ్రికా మరియు టీం ఇండియాకి జరిగిన టీ 20 మ్యాచ్ బౌలర్స్ కి స్వర్గదామం అని చెప్పాలి . ఈ మ్యాచ్ లో పిచ్ బౌలర్స్ కి అనుకూలంగా ఉండడం తో బ్యాట్మెంట్స్ పరుగులు తీయడానికి చాలా కష్టపడాల్సివచ్చింది. ప్రతిసారి టీ 20 మ్యాచ్ లలో బ్యాట్మెంట్స్ పిచ్ సహాకారంతో చెలరేగిపోయేవారు. కాని నిన్న జరిగిన మ్యాచ్ లో మాత్రం పిచ్ బౌలర్స్ కు అనుకూలం గా ఉండడం తో బౌలర్స్ మా టైం వచ్చిందనట్టు బ్యాట్మెంట్స్ పై విరుచుకుపడ్డారు.

Advertisement

సౌతాఫ్రికా బ్యాట్మెంట్స్ 20 ఓవర్లకు గాను 106/8 స్కోర్ చేసి వెనుతిరగగా భారత బ్యాట్మెంట్స్ రొహిత్ శర్మ ,విరాట్ కోహ్లీ కు అదే పరిస్థితి నెలకొంది.రోహిత్ శర్మ 0 ,మరియు కోహ్లీ 3 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. కాని అతను ఒక్కడు మాత్రం బౌలర్స్ కు అనుకూలం గా ఉన్న పిచ్ నీ తనకి అనుకూలం గా మార్చుకుని బౌలర్స్ ని వణికించాడు. వచ్చి రావడంతో రెండు సిక్స్ లు కొట్టి తన బ్యాట్ తో బౌలర్స్ కి దీటుగా సమాధానమిచ్చాడు.

Advertisement
Suryakumar Yadav broke the world record
Suryakumar Yadav broke the world record

కేవలం 33 బంతులలో 3 సిక్స్ లు 5 ఫోర్లతో 50 పరిగులు చేసి వంటిచేత్తో టీం ఇండియా నీ గెలిపించాడు. అలాగే సిక్సర్ల విషయం లో సూర్య కుమార్ వరల్డ్ రికార్డు ను బ్రేక్ చేసాడు . 2021 లో పాకిస్తాన్ ప్లేయర్ మొహమ్మదు రిజ్వాన్ 42 సిక్స్ లు కొట్టి వరల్డ్ రికార్డు సృష్టించగా ఇప్పుడు 45 సిక్స్ లతో సూర్యకుమార్ యాదవ్ ఆ రికార్డు ను బ్రేక్ చేశాడు.టీ 20 క్యాలెండరు ఇయర్ లో అత్యధిక సిక్స్ లు కొట్టిన టాప్ 10 ఆటగాళ్లలో టీం ఇండియా నుండి సూర్యకుమార్ యాదవ్ ఉండగా అందులో అతనె నంబర్ 1 గా ఉండడం విశేషం .

Advertisement