Virat Kohli : చిక్కుల్లో విరాట్ కోహ్లీ…అరెస్ట్ చేయాలంటూ డిమాండ్

Advertisement

Virat Kohli : భార‌త మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అందుకు కార‌ణం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎగతాళి చేశాడని అతని అభిమాని తన స్నేహితుడిని హత్య చేశాడు. దాంతో.. విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడులో జరిగిన ఈ సంఘటన క్రికెట్ వర్గాల్లో కలకలం రేపింది. అయితే దేశంలో కోహ్లి ఫ్యాన్స్ అంతా ఇలాగే ఉన్నారంటూ సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. అంతేకాకుండా ఫ్యాన్స్ చేష్టలకు విరాట్ బాధ్యత వహించాలని అంటున్నారు.

Advertisement

మ‌రోవైపు #ArrestKohli అనే హ్యాష్ ట్యాగ్ తో విరాట్ కోహ్లిని జైలుకు పంపించాలి అంటూ పోస్టులు పెడుతున్నారు.తమిళనాడుకి చెందిన ఎస్. ధర్మరాజ్, పి. విగ్నేష్ స్నేహితులు. ఇద్దరూ క్రికెట్ అభిమానులే. అయితే.. ధర్మరాజ్ విరాట్ కోహ్లీ అభిమానికాగా.. అతను ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్‌కి వీరాభిమాని. అలానే విగ్నేష్ ఐపీఎల్‌లోని మరో జట్టు ముంబయి ఇండియన్స్‌కి అభిమాని. దాంతో అతను రోహిత్ శర్మ అభిమాని అని అయ్యిండొచ్చు అని పోలీసులు చెప్తున్నారు. ఈ ఇద్దరి మధ్య అప్పుడప్పుడు బెంగళూరు, ముంబయి జట్లు, విరాట్ కోహ్లీ- రోహిత్ శర్మ గురించి సరదాగా వాగ్వాదం జరిగేది.

Advertisement
virat kohli can be arrested
virat kohli can be arrested

Virat Kohli : అరెస్ట్ చేయాలి…

మద్యం సేవించిన ధర్మరాజ్, పి. విగ్నేష్.. క్రికెట్ గురించి సరదాగా మాట్లాడుకుంటుండగా విగ్నేష్ వెటకారంగా విరాట్ కోహ్లీ గురించి ఎగతాళి చేశాడు. అతని మాటల్ని తట్టుకోలేకపోయిన ధర్మరాజ్ కోపద్రిక్తుడై తన చేతిలో మద్యం సీసాతో విగ్నేష్ తలపై కొట్టాడు. అనంత‌రం బ్యాట్‌ని తీసుకుని విగ్నేష్ తలపై మోదాడు. దాంతో.. విగ్నేష్ చనిపోయాడు. ఈ విష‌యం ఇప్పుడు అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారింది కీలపలూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement